'ఓటమి నుంచి తప్పించడానికి మా జట్టులో కోహ్లీ లేడు'
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ నిరాశ చెందింది. ఓటమి నుంచి తప్పించుకునే తీవ్రంగా యత్నించినా అది వీలు కాలేదు. ఆఖరి రోజైన చివరి రోజు సోమవారం 459 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా తన రెండో ఇన్నింగ్స్‌లో 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది.
దీంతో భారత్ 208 పరుగుల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది. భారత్‌తో ఓటమి అనంతరం బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ మీడియాతో మాట్లాడుతూ 'ఓటమి నుంచి తప్పించడానికి మా జట్టులో విరాట్ కోహ్లీ లేడు' అని వ్యాఖ్యానించాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన ముష్ఫికర్ రెండో ఇన్నింగ్స్‌లో 23 పరుగులకు ఔటయ్యాడు.
తాను కెప్టెన్సీ లేదా వికెట్ కీపింగ్ నుంచి తప్పుకోనని, తన యావరేజ్ 34 ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. బంగ్లా క్రికెట్ జట్టు తరపున మూడు రకాల పాత్రలు నిర్వర్తించడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉందన్నాడు.

తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు
2011 నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) తనపై నమ్మకం ఉంచి పలు రకాల బాధ్యతలు అప్పజెప్పడం పట్ల ముష్పికర్ కృతజ్ఞతలు తెలియజేశాడు. జట్టుతో పాటు ఉంటూ సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపటాన్ని ఇష్టపడుతున్నానని చెప్పాడు. కెప్టెన్నీ అనేది తన చేతుల్లో లేదని, తనని కెప్టెన్ ఉంచాలన్నా, తీసేయాలన్నా బోర్డు నిర్ణయంపై ఆధారపడుతుందని చెప్పాడు.

టీమిండియాకు టెయిలెండర్లే బలం
టీమిండియాకు టెయిలెండర్లే బలమని ముష్పికర్ అన్నాడు. బంతితో రాణిస్తూ, అవసరమైనప్పుడు టీమిండియా టెయిలెండర్లు నిలకడగా రాణిస్తున్నారని అన్నాడు. ఏ జట్టులోనైనా స్పిన్నర్లు లేదా పేసర్లు వైవిధ్యమైన బంతులు విసురుతూ ఆకట్టుకుంటారని, కానీ టీమిండియాలో మాత్రం స్పిన్నర్లు బంతిని అన్ని వైపులా తిప్పడంతో పాటు పేసర్లు పిచ్‌ను తమకు అనుకూలంగా మలచుకుంటూ బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తున్నారని చెప్పాడు.

భారత్‌తో ఆడటం మాకు లాభించింది
ఫీల్డింగ్‌లో టీమిండియా తప్పులు చేయడం లేదని అన్నాడు. బ్యాట్స్ మన్ కొట్టిన బంతి కోసం ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారని అన్నాడు. ఇన్ని సానుకూలాంశాలు ఉన్నాయి కనుకే భారత జట్టు వరల్డ్ నెంబర్ వన్ గా నిలిచిందని కితాబునిచ్చాడు. భారత్ తో ఆడడం తమకు లాభించిందని చెప్పాడు.

అనుభవలేమితో చిన్న చిన్న తప్పిదాలు
తమ లోపాలు తెలిశాయని చెప్పాడు. భారత్‌కు తాము తేలిగ్గా లొంగలేదని చెప్పాడు. మరొక్క సెషన్ ఆడి ఉన్నా, భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 500 పరుగులకు నియంత్రించినా పరిస్థితి వేరేలా ఉండేదని అన్నాడు. అనుభవలేమితో పాటు, ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలు తమను ఓటమిపాలు చేశాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications