For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

11 డిమాండ్లతో షాకిచ్చిన బంగ్లా క్రికెటర్లు: సందిగ్ధంలో భారత పర్యటన!

 Bangladesh cricketers announce indefinite strike as tour of India in doubt; BCCI guarded

హైదరాబాద్: నవంబర్ 3 నుంచి భారత్‌లో బంగ్లాదేశ్ పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు జట్టుని కూడా ప్రకటించింది. అయితే, ఈ పర్యటనపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ క్రికెటర్లు 11 పాయింట్లతో కూడిన డిమాండ్లను ఆ దేశ క్రికెట్ బోర్డు ముందుంచారు.

తమ డిమాండ్లను పరిష్కరిస్తేనే భారత పర్యటనకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెటర్లు షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇఖ్బాల్‌తో పాటు మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్ మీరజ్, అరాఫత్ సన్నీ, జునైద్ సిద్ధిఖ్, ఎనామల్ హఖ్, తస్కీన్ అహ్మద్, ఎలియాస్ సన్నీ, ఫర్హాద్ రెజాలు మీడియా సమావేశంలో తెలిపారు.

నవంబర్ 3 నుంచి బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్‌లు ఆడేందుకు వచ్చే నెలలో భారత్‌కు రానుంది. ఈ నేపథ్యంలో ఢాకా ప్రీమియర్ లీగ్‌కు, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, నేషనల్ క్రికెట్ లీగ్‌ల పేమెంట్ స్ట్రక్చర్ పెంచాలని, వారికి అందుతున్న సదుపాయాలు మెరుగు పరచాలని బంగ్లాదేశ్ క్రికెటర్లు తమ డిమాండ్లను తెరపైకి తెచ్చారు.

బంగ్లా పర్యటన వివరాలు:
నవంబరు 3న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత రెండో టీ20 మ్యాచ్‌ రాజ్‌కోట్ వేదికగా 7న, ఆఖరి టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా 10న జరగనున్నాయి. అన్ని టీ20 మ్యాచ్‌లూ రాత్రి 7 గంటలకి ప్రారంభంకానున్నాయి.

మూడు టీ20ల సిరిస్ ముగిసిన తర్వాత నవంబరు 14న నుంచి ఇండోర్ వేదికగా తొలి టెస్టు జరగనుండగా.. నవంబర్ 22 నుంచి కోల్‌కతా వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ రెండు టెస్టులూ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి.

షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, మహ్మద్ నయిం, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, అమినుల్ ఇస్లామ్, అర్ఫాట్ సన్నీ, మహ్మద్ సైఫుద్దీన్, అల్ అమిన్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సైపుల్లా ఇస్లామ్, అపిఫ్ హుస్సేన్, మసదేక్ హుస్సేన్.

Story first published: Monday, October 21, 2019, 19:41 [IST]
Other articles published on Oct 21, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+