Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరెస్టై బెయిల్‌పై వచ్చిన బంగ్లా క్రికెటర్‌పై మరో కేసు

హైదరాబాద్: బంగ్లాదేశ్ క్రికెటర్ అరాఫత్ సన్నీపై మరో కేసు నమోదైంది. తన గర్ల్ ఫ్రెండ్ నస్రీన్ సుల్తానాకు సంబంధించి అభ్యంతరకర ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివాదంలో అరెస్టై, బెయిల్‌పై బయటకు వచ్చిన సన్నీ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు.

క్రికెటర్‌ అరాఫత్‌ తన భర్త అని, ఆయనతో పాటు ఆమె తల్లి తనను కట్నం కోసం తరచూ వేధిస్తున్నారని అతడి గర్ల్‌ ఫ్రెండ్‌ నస్రీన్‌ సుల్తానా ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై మహిళలు, పిల్లల అణచివేత చట్టం కింద ఢాకా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అరాఫత్‌తో పాటు అతడి తల్లిని కూడా ఢాకా స్థానికి కోర్టులో ప్రవేశపెట్టారు.

Bangladesh cricketer Arafat Sunny sent to jail

అరాఫత్‌ను విచారించేందుకు ఏడు రోజుల కస్డడీకి అనుమతించాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాగా, గత నెలలో తన గర్ల్ ఫ్రెండ్ నస్రీన్ సుల్తానాకు సంబంధించి అభ్యంతరకర ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి అరెస్టయ్యాడు. ఈ కేసులో అతడు దోషీగా తేలితే 14 ఏళ్ల జైలు శిక్ష లేదా రూ.86 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే కోర్టు విచారణ సందర్భంగా తాను అరాఫత్ భార్యనని అతని గర్ల్ ఫ్రెండ్ నస్రీన్ తెలిపింది. గతంలో షాహదత్‌​ హుస్సేన్‌, రుబెల్‌ హుస్సేన్‌‌ల తర్వాత అరెస్టయిన మూడో బంగ్లాదేశ్ క్రికెటర్‌ అరాఫత​ సన్నీ. బంగ్లాదేశ్ తరుపున అరాఫత్ సన్నీ 16 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లాడాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+