ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఘనంగా నిర్వహించాలని, తమ గడ్డపై టీమిండియా తిరిగి అడుగుపెట్టించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న పాకిస్థాన్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. పాకిస్థాన్‌కు ఎట్టిపరిస్థితుల్లో వెళ్లమని ఐసీసీకి బీసీసీఐ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది.
అయితే పుండు మీద కారం చెల్లినట్లుగా పాకిస్థాన్‌ను ఇటీవల భారత్ మరో దెబ్బకొట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మన దేశంలో టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఆసియా కప్‌కు పాకిస్థాన్ తప్పక రావాల్సిన పరిస్థితిని భారత్ సృష్టించింది. ఇండియాకు వెళ్లాల్సిందే అని ఇప్పటి నుంచే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ నుంచి పాకిస్థాన్‌పై ఒత్తిడి మొదలుపెట్టింది.

మరోవైపు తమ దేశానికి రావడానికి అంగీకరించనికి భారత్‌కు ఎలా వెళ్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రశ్నలు షురూ చేసింది. అయితే ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ను బీసీసీఐ రంగంలోకి దింపింది. పాకిస్థాన్‌లో శాంతి భద్రతల సమస్యలు ఉంటాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి పరోక్షంగా ప్రకటనలు విడుదల చేయించింది. ఈ నెలలో జరగనున్న పాకిస్థాన్ పర్యటనలో తమ జట్టుకు సెక్యూరిటీ కన్సెల్టెంట్‌ను ఇవ్వాలని బంగ్లా బోర్డు తమ ప్రభుత్వాన్ని కోరేలా బీసీసీఐ చేసింది.
దీంతో పాకిస్థాన్‌కు వెళ్లడానికి బంగ్లాదేశ్ బోర్డు కూడా భయపడుతుందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో భారత్ తప్పక రావాల్సిందే అని పాక్ బోర్డు డిమాండ్ చేసే అవకాశం కోల్పోయింది. ఆగస్టు 21 నుంచి పాకిస్థాన్‌తో బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ సజావుగా సాగినా బంగ్లాదేశ్ సెక్యూరిటీ కన్సల్టెంట్ డిమాండ్‌తో.. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత ఆటగాళ్లకు పాకిస్థాన్‌లో శాంతి భద్రత సమస్యలు ఉంటాయమోననే ఐసీసీ ఆలోచనలో పడింది.