నో ఐపీఎల్, నో పీఎస్ఎల్: రెంటికీ చెడ్డ రేవడు
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందులో ఆడేందుకు గతంలో జారీ చేసిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ను రద్దు చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే అనంతరం ముస్తాఫిజుర్‌కు మెడికల్ ఎవాల్యూషన్ చేయించుకోవాల్సిన అవసరం రావడంతో బీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన సైతం విడుదల చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్. జట్టు మెడికల్ స్టాఫ్ ముస్తాఫిజుర్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి, అతనికి తక్షణమే స్కానింగ్ చేయించుకోవాలని సిఫార్సు చేసినట్లు పేర్కొంది. త్వరలోనే అతను బోర్డు మెడికల్ టీమ్ పర్యవేక్షణలో రిహాబిలిటేషన్ వెళ్తాడని స్పష్టం చేసింది. దీని ఫలితంగా ముస్తాఫిజుర్ పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లో మిగిలిన మ్యాచ్‌లలో పాల్గొనబోడని వెల్లడించింది.

ఈ విషయంలో, బోర్డు గతంలో ముస్తాఫిజుర్‌కు జారీ చేసిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ని కూడా ఉపసంహరించుకుందని పేర్కొంది. ఎన్ఓసీ లేకపోవడం వల్ల పీఎస్ఎల్ లో మిగిలిన మ్యాచ్‌లకు రెహ్మాన్ అందుబాటులో ఉండబోడని, పీఎస్ఎల్ ఫ్రాంఛైజీ ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ముస్తాఫిజుర్‌తో పాటు యువ ఫాస్ట్ బౌలర్ నహిద్ రానాను కూడా పీఎస్ఎల్ లో ఆడేందుకు అనుమతి ఇవ్వబోమని బంగ్లా క్రికెట్ బోర్డు ప్రకటించింది.
రాబోయే టెస్ట్ మ్యాచ్‌లకు అతన్ని ప్రిపేర్ చేయాల్సి ఉందని బోర్డు వెల్లడించింది. వచ్చే నెల పాకిస్తాన్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం నహీద్ రానా ట్రైనింగ్ సెషన్స్ కు హాజరు కావాల్సి ఉందని, అతనికి తగిన సమయం ఇవ్వడానికి పీఎస్ఎల్ నుంచి తప్పించినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 27 నుండి ప్రారంభం అయ్యే న్యూజిలాండ్‌తో జరిగే తొలి రెండు టీ20 ఇంటర్నేషనల్స్ లకు బంగ్లాదేశ్ కొత్త జట్టును ప్రకటించింది.
ముస్తాఫిజుర్, తస్కిన్ అహ్మద్, నహిద్ రానాతో సహా రెగ్యులర్ పేసర్లకు విశ్రాంతినివ్వడంతో, కొత్త ముఖాలకు అవకాశాలు లభించాయి. అబ్దుల్ గఫ్ఫార్ సక్లైన్ అరంగేట్రం చేయనున్నాడు. అలాగే దేశీయంగా నిలకడగా రాణిస్తున్న డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ రిపోన్ మొండల్ జట్టులో చోటు సంపాదించాడు. లిట్టన్ దాస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బంగ్లాదేశ్ జట్టులో మహమ్మద్ పర్వేజ్ హుస్సేన్ ఇమోన్, తన్జిద్ హసన్, మహమ్మద్ సైఫ్ హసన్, షమీమ్ హుస్సేన్, తౌహిద్ హృదయ్, ఖాజీ నూరుల్ హసన్ సోహన్, షక్ మెహెది హసన్, నసుమ్ అహ్మద్, రిషాద్ హుస్సేన్, షోరీఫుల్ ఇస్లాం, తన్జిమ్ హసన్ సకిబ్, షైఫ్ ఉద్దీన్ వంటి ఆటగాళ్ళు ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications