
ఫస్ట్ సెషన్‌లో 2 వికెట్లు
నేడు ఉదయం 175-2 వికెట్లతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్ ఆరంభంలోనే 184 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 78 పరుగులు చేసిన మహ్మదుల్ హసన్ జాయ్‌ను వాగ్నర్ ఔట్ చేశాడు. 203 పరుగుల వద్ద 12 పరుగులు చేసిన ముష్కియర్ రహీమ్‌ను బోల్ట్ బౌల్డ్ చేశాడు. అనంతరం మరో వికెట్ పడకుండా జాగ్రత్త బంగ్లాదేశ్ 220-4 తో లంచ్‌కు వెళ్లింది. కాగా బంగ్లాదేశ్ తొలి సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయింది.

రెండో సెషన్ బంగ్లాదే
లంచ్ బ్రేక్ తర్వాత ప్రారంభమైన రెండో సెషన్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు పూర్తి అధిపత్యాన్ని కనబరిచారు. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ మోమినుల్ హక్‌తోపాటు వికెట్ కీపర్ లిటన్ దాస్ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. కెరీర్‌లో మోమిన్‌ల్‌కు ఇది 15వ హాఫ్ సెంచరీ కాగా, లిటన్ దాస్‌కు 11వ హాఫ్ సెంచరీ. వీరిద్దరు సెకండ్ సెషన్‌లో వికెట్ పడకుండా 87 పరుగులు జోడించారు. దీంతో బంగ్లాదేశ్ 307-4తో టీ బ్రేక్‌కు వెళ్లింది.

థర్డ్ సెషన్‌లోనూ అధిపత్యం
మోమినుల్ హక్, లిటన్ దాస్ కలిసి ఐదో వికెట్‌కు 158 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 361 పరుగుల వద్ద ఉండగా 88 పరుగులు చేసిన మోమినుల్‌ను ఔట్ చేసి ఈ భాగస్వామ్యానికి బోల్డ్ బ్రేక్ వేశాడు. ఆ వెంటనే మరోసారి చెలరేగిన బోల్ట్ 86 పరుగులు చేసిన లిటన్ దాస్‌ను ఔట్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 370 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత యాసిర్ అలీ, హాసన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.
మూడో రోజు బంగ్లాదేశ్‌దే
దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 401 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్రీజులో యాసిర్ అలీ(11), హాసన్ (20) ఉన్నారు. కాగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులకు ఆలౌటైంది. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ 73 పరుగుల అధిక్యంలో ఉంది. మూడో రోజు ఆటలో మొత్తంగా 226 పరుగులు, 4 వికెట్లు మాత్రమే నమోదయ్యాయి. దీంతో మూడో రోజు బంగ్లాదేశ్ అధిపత్యం చెలాయించినట్టయింది. నాలుగో రోజు ఆటలో కూడా బంగ్లాదేశ్ ఇదే ఆటను కనబరిస్తే తొలి ఇన్నింగ్స్‌లో భారీ అధిక్యం సాధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












