T20 World Cup 2022: రనౌట్‍తో అదరగొట్టిన షకీబుల్ హసన్.. వైరల్ అయిన వీడియో..

జింబాబ్వే, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో బంగ్లాదేశ్ మూడు పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ బంగ్లాదేశ్ కెప్టెన్ సూపర్ ఫీల్డింగ్ చేశాడు. 19వ ఓవర్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అద్భుత ఫీల్డింగ్ తో సీన్ విలియమ్స్‌ను రనౌట్ చేశాడు.షకీబ్ తన కుడి వైపునకు వచ్చి బంతి డైవ్ చేసి త్రో వేశాడు. దీంతో
64 పరుగులు సీన్ విలియమ్స్ నిష్క్రమించాల్సి వచ్చింది.
శాంటో
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ శాంటో హాఫ్ సెంచరీతో రాణించాడు. 55 బంతుల్లో ఒక సిక్స్, 7 ఫోర్లతో 71 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సౌమ్య సర్కార్ డకౌట్ కాగా.. కెప్టెన్ షకీబుల్ హసన్ 23, హుస్సేన్ 29 పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ, ముజారబానీ రెండేసి వికెట్ల పడగొట్టగా.. రజా, సీన్ విలియమ్స్ ఒక్కో వికెట్ తీశారు
సీన్ విలియమ్స్
151 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఛేదనలో జింబాబ్వే ఆదిలోనే ఓపెనర్లను కోల్పోయింది. మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్, తక్కువ పరుగులకే ఔటయ్యారు. తర్వాత వచ్చిన మిల్టన్ శుంబా త్వరగా పెవిలియన్ చేరాడు. సీన్ విలియమ్స్ జట్టును ఆదుకున్నాడు. జట్టును గెలిపించే ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు. విలియమ్స్ 42 బంతుల్లో 8 ఫోర్లతో 64 పరుగులు చేశాడు.
చివరి బంతికి ఉత్కంఠ
ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో ఉత్కంఠ నెలకొంది. చివరి బంతికి, జింబాబ్వే విజయానికి 5 పరుగులు అవసరం కాగా ముజరబని ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. మొసాద్దిక్ వేసిన బంతిని భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి..ముజరబని టైమింగ్ మిస్ అయ్యాడు. క్రీజ్ నుంచి బయటికొచ్చాడు. అక్కడ బంతి మిస్ అయింది.ఆ బంతితో వికెట్లను గిరాటేశాడు. కీపర్ నూరుల్ హసన్. స్టంపౌట్‌గా భావించారందరూ. అంపైర్ మాత్రం దాన్ని నో బాల్‌గా ప్రకటించాడు. బంతిని అందుకునే సమయంలో కీపర్ నూరుల్ హసన్ గ్లోవ్స్ స్టంప్స్‌ను దాటి ముందుకొచ్చాయి. కీపర్ గ్లోవ్స్ స్టంప్స్‌ను దాటి వచ్చిన సమయంలో ఐసీసీ నిబంధనల ప్రకారం- ఆ బంతిని నో బాల్‌గా గుర్తించాల్సి ఉంటుంది. అంపైర్ అదే చేశాడు. దాన్ని నో బాల్‌గా ప్రకటించాడు. తర్వాత బంతికి కూడా ముజరబని పరుగు చేయలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications