Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'మావోడు ఉన్నాడు జాగ్రత్త'.. టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన బంగ్లా కెప్టెన్!

ఛాంపియన్స్ ట్రోఫీ వేట మొదలైంది. టీమిండియా తన తొలి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఆడనుంది. ఫిబ్రవరి 20న ఇది జరగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్‌ హుస్సేన్‌ శాంటో. ఫామ్ లో ఉన్న టీమిండియాను ఓడించడానికి తమ జట్టులో క్వాలిటీ పేసర్లు, ఆల్ రౌండర్లు ఉన్నారని అన్నాడు. ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.

మా వోడు ఇబ్బంది పెడతాడు..
టీమిండియాను ఓడించడానికి తమకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పాడు నజ్ముల్. తమ జట్టు యంగ్ పేసర్ నహీద్ రాణా మెరుగైన ప్రదర్శనతో భారత జట్టు బ్యాటర్లను ఇబ్బంది పెడతాడని పేర్కొన్నాడు. "మాకు కొంతమంది మంచి ఆల్ రౌండర్లు ఉన్నారు. వారిపైన మేం ఆధారపడ్డాం. ఈ టోర్నీలో అన్ని జట్లకు గెలవగల సామర్థ్యం ఉంది.
భారత్ ను ఓడించాలంటే మేం అన్నీ విభాగాల్లోనూ మంచి ప్రదర్శన చేయాలి. భారత్ పై మాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. మేం మా ప్లాన్ ను కరెక్ట్ గా అమలు చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. మేము మాకున్న అవకాశాలను పరిశీలించుకుంటున్నాం. మాకు కొంతమంది ఫాస్ట్ బౌలర్లు కూడా ఉన్నారు. మా జట్టులో నహీద్ రాణా లాంటి ఫాస్ట్ బౌలర్ ఉండటం సంతోషకరమైన విషయం. అతడు మంచిగా రాణిస్తే.. తన బాధ్యతను పూర్తి చేస్తాడు. మాకు మంచి స్పిన్, ఫాస్ట్ బౌలర్ల కాంబినేషన్ ఉంది." అని అన్నాడు. కాగా, రానా ఇప్పటివరకు కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడి నాలుగు వికెట్లు తీశాడు. అయితే ఎర్ర బంతి ఫార్మాట్ లో అతడికి మంచి రికార్డ్ ఉంది. ఆరు మ్యాచుల్లో 20 వికెట్లు తీశాడు.

Bangladesh captain Najmul Hossain Shanto warns TeamIndia in Champions Trophy 2025 ind vs ban match

ఒక్కడినే టార్గెట్ చేయట్లేదు..
టీమిండియాలో బుమ్రా లేడన్న సంగతి తెలిసిందే. అతడు లేకపోవడం జట్టుకు లోటే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మాట్లాడిన శాంటో.. "బంగ్లా జట్టు వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయట్లేదు. మొత్తం జట్టుపై ఫోకస్ చేస్తోంది. అలానే మా బ్యాటర్లు కూడా మంచి హై స్కోర్ చేస్తారని ఆశిస్తున్నా. బీపీఎల్ మా బ్యాటర్లు మంచిగా ఆడారు. కాకపోతే ఇంకాస్త అడ్జెస్ట్ చేయాల్సినది ఉంది. మాకు మద్దతుగా నిలిచే వారు చాలా మంది ఉన్నారు. మా కోసం చాలా మంది ప్రేక్షకులు స్టేడియానికి వచ్చి మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నాం." అని పేర్కొన్నాడు.

Story first published: Wednesday, February 19, 2025, 18:11 [IST]
Other articles published on Feb 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+