Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు.. బంగ్లా కెప్టెన్ భార్య ఫోటోలు వైరల్!!

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు సారథిగా ఎంపికైన హిందూ క్రికెటర్ లిట్టన్ దాస్ ఇప్పుడు క్రీడా ప్రపంచంలోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ హాట్ టాపిక్ అయ్యారు. లిట్టన్ దాస్ వ్యక్తిగత జీవతం, ముఖ్యంగా ఆయన భార్య దేవశ్రీ బిస్వాస్ సంచితకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

శ్రీకృష్ణుని పరమ భక్తురాలు
దేవశ్రీ బిస్వాస్ సంచిత శ్రీకృష్ణుని పట్ల అపారమైన భక్తిని కలిగి ఉన్నారు. తనను తాను కృష్ణుని దాసిగా అభివర్ణించుకుంటారు. కేవలం కృష్ణుడే కాకుండా మహాదేవుడు, శ్రీరాముడు, వినాయకుడు, లక్ష్మీదేవి, కాళికా మాతను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. బంగ్లాదేశ్‌లో ఉంటూనే హిందూ పండుగలైన హోలీ, దీపావళి, దసరా వంటి వాటిని ఈ దంపతులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

Bangladesh Captain Litton Das Wife Sanchita Biswas Photos Go Viral on Social Media

చదువులో మేటి.. వృత్తిరీత్యా రైతు!
దేవశ్రీ సంచిత చదువులో ఎంతో ప్రతిభావంతురాలు. షేర్-ఎ-బంగ్లా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ (MBA) పట్టా పొందారు. అయితే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో తనను తాను ఒక రైతుగా పేర్కొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వ్యవసాయం పట్ల ఆమెకున్న మక్కువ, మూగజీవాల పట్ల ఆమె చూపే ప్రేమ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Bangladesh Captain Litton Das Wife Sanchita Biswas Photos Go Viral on Social Media

2019లో వివాహం.. ఓ పెద్ద ప్రమాదం
లిట్టన్ దాస్, దేవశ్రీ బిస్వాస్ సంచిత చాలా కాలం పాటు ప్రేమలో ఉండి, 2019లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన ఏడాదికే (2020లో) సంచిత ఒక పెద్ద ప్రమాదానికి గురయ్యారు. వంటింట్లో టీ చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆమె గాయపడ్డారు. ఆ క్లిష్ట పరిస్థితుల నుండి కోలుకుని ఆమె మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చారు.

Bangladesh Captain Litton Das Wife Sanchita Biswas Photos Go Viral on Social Media

సోషల్ మీడియాలో సెలబ్రిటీ
సంచితకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఆమె అందం నెటిజన్లను కట్టిపడేస్తుంది. తరచుగా తన భర్తతో కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలను, పండుగ వేడుకల చిత్రాలను పంచుకుంటారు. వీరిద్దరూ తరచుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతుంటారనే వార్తలు ఉన్నప్పటికీ, వారు వాటిని పట్టించుకోకుండా తమ పనిపై దృష్టి పెడతారు.

Story first published: Sunday, January 4, 2026, 17:08 [IST]
Other articles published on Jan 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+