భారత్‌తో ఆడనున్న జట్టుకు షాక్, వరకట్న వేధింపు కేసులో క్రికెటర్

ఢాకా: ఉన్న వాడికి ఉండి బాధ లేని వాడికి లేక బాధ... ఎన్ని కోట్లు డబ్బున్నా ఇంకా కావాలనుకొనే అత్యాశకు ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెటర్ కూడా లోనైయ్యాడు. ఆ క్రమంలోనే అతని భార్య వరకట్న వేదింపులకు పాల్పడ్డాడు. ఇదంతా బంగ్లాదేశ్ క్రికెటర్ మొసద్దక్ హుస్సేన్ సైకత్‌పై అతని భార్య చేస్తున్న ఆరోపణలు. కొన్ని నెలలుగా తనను శారీరకంగా.. మానసికంగా వేదిస్తున్నాడంటూ హుస్సేన్ భార్య అతనిపై ఫిర్యాదు చేసింది.
22 ఏళ్ల మొసద్దక్ ఆరేళ్ల కిందట తన కజిన్ అయిన షర్మిన్ సమీరా ఉషను ఇస్లాం పద్ధతి ద్వారా వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సెప్టెంబర్ నెలలో జరగనున్న ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ సెలక్టర్లు అతనికి జట్టులో చోటు కల్పించారు. ఈ మ్యాచ్‌కు సన్నద్ధమవుతోన్న క్రికెటర్‌కు అతని భార్య షాక్‌కు గురి చేసింది. మొసద్దక్ కట్నం కోసం వేధిస్తున్నట్లు అతని భార్య ఉష కేసు వేసినట్లు అడిషనల్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ రోసినా ఖాన్ వెల్లడించారు.
దీనిపై సదర్ ఉపజిలా ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌ను కేసు విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. చాలా రోజులగా కట్నం కోసం ఉషను అతడు వేధిస్తున్నట్లు ఆమె తరఫు లాయర్ రెజౌల్ కరీమ్ దులాల్ చెప్పారు. పది లక్షల డాకాలు కట్నంగా ఇవ్వాలంటూ అతడు ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టాడని ఆయన తెలిపారు. అయితే ఈ కేసుపై ఇప్పటివరకు మొసద్దక్ స్పందించలేదు.
అయితే పెళ్లి జరిగినప్పటి నుంచే ఇద్దరికీ ఏ విషయంలోనూ పొసగడం లేదని అతని సోదరుడు మొసబ్బీర్ హుస్సేన్ చెప్పాడు. ఈ నెల 15నే ఉష అతనికి విడాకుల నోటీసులు పంపించిందని, అయితే ఆమె భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నదని అతని తెలిపాడు. ఆ డబ్బు ఇవ్వనందుకే ఇలా తప్పుడు కేసు పెట్టిందని అతను ఆరోపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications