Asia Cup 2022 : షకీబ్ అల్ హసన్‌కు లైన్ క్లియర్.. ఆసియా కప్ ఆడే బంగ్లాదేశ్ టీం ఇదే..!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 మధ్య జరిగే ఆసియా కప్ టోర్నీ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) 17 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. వెటరన్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అలాగే అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ జట్టుకు కూడా షకీబ్ అల్ హసన్ నాయకత్వం వహించనున్నాడు. జట్టులో అనాముల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, మొసద్దెక్ హొస్సేన్, మహ్మదుల్లా, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్ మరియు ముస్తాఫిజుర్ రహ్మాన్ లాంటి ఇన్ ఫామ్ ప్లేయర్లు ఉన్నారు. వేలి గాయం కారణంగా ఇటీవల జింబాబ్వే వైట్-బాల్ సిరీస్‌కు దూరమైన నూరుల్ హసన్ సోహన్ ఆసియా కప్‌లో తిరిగి ఆడనున్నాడు.
బీసీబీ ఆసియా కప్ జట్టును ముందుగానే ప్రకటించాల్సింది. కానీ షకీబ్ అల్ హసన్ స్పాన్సర్‌షిప్ సమస్యలను పరిష్కరించడానికి టైం పట్టడంతో డిలే అయింది. బెట్టింగ్ కంపెనీ అయిన బెట్విన్నర్ న్యూస్‌తో షకీబ్ అల్ హసన్ తన వాణిజ్య అనుబంధాన్ని ముగించడంతో అతనికి లైన్ క్లియర్ అయింది. షకీబ్ తన తప్పును ఒప్పుకున్నాడని, అతను మాకు కీలకమైన ప్లేయర్ అని బీసీబీ క్రికెట్ కార్యకలాపాల ఛైర్మన్ జలాల్ యూనస్ చెప్పాడు. ఇక బంగ్లాదేశ్ ఆసియా కప్ ప్రదర్శన విషయానికొస్తే.. ఇప్పటివరకు ఆ జట్టు మూడు సార్లు ఫైనల్ చేరినప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. 2012, 2016, 2018లలో ఫైనల్లో ఓటమి పాలయింది.
ఆసియా కప్ కోసం ప్రకటించిన బంగ్లాదేశ్ జట్టు:

షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), అనాముల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, మొసద్దెక్ హొస్సేన్, మహ్మదుల్లా, మహేదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, నసుమ్ అహ్మద్, సబ్బీర్ రహ్మాన్, ఇహొసా పర్హమాన్, మెహిదీ హసనోత్ నూరుల్ హసన్ సోహన్, తస్కిన్ అహ్మద్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications