ప్రపంచకప్ చరిత్రలో నిలిచిపోయే రికార్డ్ తృటిలో మిస్! ఇంతకీ.. ఎవరా బ్యాట్స్‌మెన్?

టాంటన్: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఆదివారం నాడు భారత్-పాకిస్తాన్ మధ్య ముగిసిన మ్యాచ్.. అనేక రికార్డులను నెలకొల్పింది కదా! అచ్చం అలాంటి కొన్ని రికార్డులు సోమవారం టాంటన్‌లోని కూపర్స్ అసోసియేట్స్ కంట్రీ గ్రౌండ్ వేదికగా వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా నమోదు కావడానికి అవకాశాలు ఉన్నాయి. వాటిల్లో ఓ అరుదైన రికార్డ్ లిట్టన్ కుమార్ దాస్‌కు సంబంధించినది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన లిట్టన్ దాస్.. తృటిలో సెంచరీని మిస్ అయ్యాడు. అలాగని అవుట్ కాలేదు. నాటౌట్‌గా నిలిచాడు. 94 పరుగుల వద్దే నిలిచిపోయాడు. మూడంకెల స్కోరును అందుకుని ఉంటే రికార్డు సృష్టించేవాడు.

ఆడుతున్నది తొలి ప్రపంచకప్ మ్యాచ్ అయినా..
133 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయిన దశలో బంగ్లాదేశ్ పతనం తప్పదని భావించారు విశ్లేషకులు. ముష్ఫికర్ రహీమ్ పెవిలియన్ బాట పట్టిన తరువాత.. వచ్చే బ్యాట్స్‌మెన్లు ఒత్తిడిని తట్టుకోలేరని అంచనా వేశారు. ముష్పికర్ అవుటైన తరువాత క్రీజులోకి వచ్చిన లిట్టన్ దాస్ అనూహ్యంగా పోరాడాడు. క్రీజులో పాతుకుని పోయాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో చెలరేగిపోయి ఆడుతోన్న షకీబ్ అల్ హసన్‌కు తోడుగా నిలిచాడు. నిజానికి- లిట్టన్ దాస్‌కు ఇంతకు ముందెప్పుడూ ప్రపంచకప్‌లో ఆడిన అనుభవం లేదు.

అరంగేట్రంలో అదరగొట్టిన దాస్
అతనికి ఇదే ప్రపంచకప్ అరంగేట్రం మ్యాచ్. అయినప్పటికీ.. ఎక్కడా ఒత్తిడికి లోను కాలేదు. నింపాదిగా ఆడుకుంటూ వెళ్లాడు. 69 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఎనిమిది బౌండరీలతో 94 పరుగులు చేశాడతను. నాటౌట్‌గా నిలిచాడు. తృటిలో సెంచరీని మిస్ అయ్యాడు. లేకుంటే అదో రికార్డు అయ్యుండేది. ప్రపంచకప్ అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచేవాడు. షకిబ్ అల్ హసన్‌తో కలిసి నాలుగో వికెట్ 189 పరుగులను జోడించాడు. గాబ్రియెల్ వేసిన 38వ ఓవర్‌లో విశ్వరూపాన్ని చూపాడు లిట్టన్ దాస్. వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు.

తొలి సెంచరీ భారత్‌పై
లిట్టన్ కుమార్ దాస్ తన వన్డే కేరీర్‌లో తొలి వన్డేను టీమిండియాపై సాధించాడు. గత ఏడాది షార్జా వేదికగా సాగిన ఆసియాకప్ టోర్నమెంట్‌లో లిట్టన్ దాస్ ఈ ఘనతను సాధించాడు. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేపట్టింది. ఈ మ్యాచ్‌లో దాస్.. తన తొలి సెంచరీ మైలురాయిని అందుకున్నాడు. పదునైన వనరులు ఉన్న భారత్ బౌలింగ్‌ను తుత్తునీయలు చేశాడు. 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో సరిగ్గా 117 బంతుల్లో 121 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌ను భారత్ గెలిచింది. ఆసియాకప్ విజేతగా నిలిచింది. అదే స్ఫూర్తిని లిట్టన్ దాస్ ప్రపంచకప్‌లో చూపించాడు. తన అరంగేట్రం మ్యాచ్‌లో అదరగొట్టాడు. ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications