పోరాడిన కోహ్లీ.. ఢిల్లీ లక్ష్యం 150

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 41(33 బంతుల్లో 1x4, 2x6) పోరాడి.. జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి.. ఢిల్లీ ముందు 150 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఆరంభంలోనే షాక్:
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఢిల్లీ బౌలర్ క్రిస్ మోరిస్ వేసిన రెండవ ఓవర్ చివరి బంతికి ఓపెనర్ పార్థీవ్ పటేల్ (9) సందీప్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అనంతరం కెప్టెన్ కోహ్లీ.. డివిలియర్స్ తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసాడు. అయితే రబడా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన డివిలియర్స్ (17).. ఇన్‌గ్రామ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోనిస్ (15) తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు.

అలీ మెరుపులు:
ఒకవైపు వికెట్లు పడుతుండడంతో కోహ్లీ భారీ షాట్లకు పోకుండా సింగిల్స్ తీసాడు. మరోవైపు మొయిన్ అలీ 32 (18 బంతుల్లో; 1x4, 3x6) బ్యాట్ జులిపించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో సందీప్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి.. స్టంప్ అవుట్ అయ్యాడు. దీంతో బెంగళూరు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

రబడా సూపర్ షో:
అలీ నిష్క్రమణ అనంతరం విరాట్ వేగం పెంచాడు. వరుసగా రెండు సిక్సులు కొట్టి ఊపుమీద కనిపించిన కోహ్లీ.. రబడా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అక్షదీప్ నాథ్ బౌండరీల మోత మోగించినా.. ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఒకే ఓవర్లో రబడా సూపర్ షోతో మూడు వికెట్లు తీసి బెంగళూరు వెన్ను విరిచాడు. ఆ తర్వాత వచ్చిన వారు కూడా త్వరగానే అవుట్ అవ్వడంతో బెంగళూరు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లు రబడా 4, మోరిస్ 2 వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications