Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌కు ధోనీ ఎంతో అవసరం: హర్ష భోగ్లే

Bangalore vs Chennai: MS Dhoni you are a freak, Former Cricketrs react on Twitter

క్రికెట్‌కు ఎంఎస్ ధోనీ ఎంతో అవసరం అని క్రికెట్‌ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ప్రశంసించారు. బెంగళూరు వేదికగా ఆదివారం రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోనీ (48 బంతుల్లో 84 నాటౌట్‌; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖరి ఓవర్లో అయితే వరుసగా ఐదు బంతుల్లో 4, 6, 6, 2, 6తో 24 పరుగులు చేసాడు. అయితే దురదృష్టవశాత్తు చెన్నై మ్యాచ్ ఓడినా.. ధోనీని అందరూ ప్రశంసిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు ట్విటర్‌ వేదికగా ధోనీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఉఫ్‌! ఇది మంచి గేమ్. క్రికెట్‌కు ధోనీ ఎంతో అవసరం: హర్ష భోగ్లే

ఐపీఎల్ అన్ని మ్యాచుల్లో ఇది సూపర్ మ్యాచ్. ధోనీ ఇన్నింగ్స్‌ అద్భుతం.. చరిత్రలో నిలిచిపోతుంది. థాంక్యూ తాలా: చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం.

ఎంఎస్ ధోనీకి ఏదైనా సాధ్యమే. లక్ష్య ఛేధనలో ప్రశాంతత ఒక కేస్‌ స్టడీగా ఉంటుంది. క్యా ప్లేయర్‌ హై: ఆకాశ్‌ చోప్రా

అంతా ఊపిరి పీల్చుకోండి. ఈ ఐపీఎల్‌ అద్భుతంగా సాగుతోంది: గ్రేమ్‌ స్మిత్‌

ఈ సీజన్‌లో ప్రత్యేకమైన క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాం: కెవిన్‌ పీటర్సన్‌

మహీ భాయ్‌ నుంచి ఓ ప్రత్యేకమైన ఇన్సింగ్స్‌ ఇది. ఒకే ఓవర్‌లో 26 పరుగులు చేయడం అసాధ్యం. కానీ ధోనీ ప్రత్యర్థి నుంచి దాదాపు మ్యాచ్‌ను లాగేసుకున్నంత పని చేశాడు: మహమ్మద్‌ కైఫ్‌

వావ్‌.. క్రికెట్‌లో ఆర్సీబీ, చెన్నై మ్యాచ్‌ ఓ అద్భుతం: వీరేంద్ర సెహ్వాగ్‌

Story first published: Monday, April 22, 2019, 16:28 [IST]
Other articles published on Apr 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+