న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌: 4000 పరుగులు.. 200 సిక్సర్లు

IPL 2019 : MS Dhoni Crossed 4000 Runs,200 Sixes In IPL Hostory || Oneindia Telugu
Bangalore vs Chennai: MS Dhoni scripts twin IPL records after epic knock against RCB

4,000 పరుగులు.. 200 సిక్సర్లు.. ఈ రికార్డులు సాధించింది ఒక్కరే. అతడే చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ. బెంగళూరు వేదికగా ఆదివారం రాత్రి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఈ రికార్డులు సాధించాడు.

4,000 వేల పరుగులు:

4,000 వేల పరుగులు:

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) చరిత్రలో 4,000 వేల పరుగులు పూర్తి చేసిన మొదటి కెప్టెన్‌గా మహేంద్ర సింగ్‌ ధోనీ నిలిచాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ధోనీ 184 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి.. 42.03 సగటుతో 4,330 పరుగులు చేశాడు. ఇందులో 23 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ రావడంతో ధోనీకి సెంచరీ చేసే అవకాశం రాలేదు.

200 సిక్సర్లు:

200 సిక్సర్లు:

ఇక ఐపీఎల్‌లో 200 సిక్సర్లు బాదిన తొలి భారత బాట్స్‌మన్‌గా ధోనీ రికార్డుల్లోకి ఎక్కాడు. రోహిత్‌ శర్మ (190), సురేశ్‌ రైనా( 190), విరాట్‌ కోహ్లి (186)లు ధోనీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే మొత్తంగా మాత్రం ధోనీ (203) మూడో స్థానంలో ఉన్నాడు. విండీస్ బాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ (323) మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. ఏబీ డివిలియర్స్‌ (204) రెండో స్థానంలో ఉన్నాడు.

ఈ సీజన్‌లో 314 పరుగులు:

ఈ సీజన్‌లో 314 పరుగులు:

ఈ సీజన్‌లో ధోనీ పరుగుల వరద పారిస్తున్నాడు. ఆదివారం రాత్రి బెంగళూరుపై 84 పరుగులు చేసి.. అత్యధిక వ్యక్తిగత స్కోరును మెరుగుపరుచుకున్నాడు. ఇంతకుముందు ఈ సీజన్‌లో కోల్‌కతా మీద చేసిన 75 పరుగుల అత్యధిక స్కోరు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 314 పరుగులు చేయగా.. అందులో 17 సిక్సర్లు ఉన్నాయి. అయితే బెంగళూరుపై 84 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు శతవిధాలా ప్రయత్నించినా కుదరలేదు.

Story first published: Monday, April 22, 2019, 14:51 [IST]
Other articles published on Apr 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X