Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పార్థివ్‌ అర్ధశతకం.. చెన్నై లక్ష్యం 162

Bangalore vs Chennai: Chennai Super Kings target is 162

బెంగళూరు వేదికగా చెన్నైసూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి చెన్నై ముందు 162 పరుగుల లక్ష్యంను ఉంచింది. టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు శుభారంభం అందించలేదు. కెప్టెన్‌ కోహ్లీ (2) దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్‌ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ సమయంలో డివిలియర్స్‌ మెరుపులు మెరిపించాడు.

అయితే రవీంద్ర జడేజా వేసిన 6.5వ బంతికి ఓపెనర్‌ డివిలియర్స్‌ (25) షాట్‌కు ప్రయత్నించి డుప్లెసిస్‌ చేతికి చిక్కాడు. అనంతరం అక్ష్‌దీప్‌నాథ్‌.. పార్థివ్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. ధాటిగా ఆడే క్రమంలో రవీంద్ర జడేజా వేసిన 13వ ఓవర్‌లో అక్ష్‌దీప్‌నాథ్‌ (24) డు ప్లెసిస్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు. అనంతరం మరో ఓపెనర్‌ పార్థివ్‌ పటేల్‌ (53, 37 బంతుల్లో 2x4, 4x6) ధాటిగా ఆడి అర్ధ శతకం సాధించి అవుట్ అయ్యాడు.

పార్థివ్‌ నిష్క్రమణ అనంతరం మార్కస్‌ స్టోయినిస్‌ (14), మొయిన్‌ అలీ (26, 16 బంతుల్లో 5x4) దూకుడుగా ఆడి బెంగళూరు స్కోరును 160 దాటించారు. చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌, రవీంద్ర జడేజా, బ్రావో రెండేసి వికెట్లు తీశారు. బెంగళూరు ఇన్నింగ్స్ లో పార్థివ్‌ మాత్రమే ఆకట్టుకున్నాడు.

Story first published: Sunday, April 21, 2019, 22:35 [IST]
Other articles published on Apr 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+