Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs RCB: మ్యాచ్ పోయిందనుకున్నా.. సిరాజ్, ఏబీకి హ్యాట్పాఫ్‌: కోహ్లీ

Bangalore captain Virat Kohli praises AB de Villiers and Mohammed Siraj after RCB Beat DC
IPL 2021, DC vs RCB: Kohli Praises AB de Villier And Mohammed Siraj | Oneindia Telugu

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 1 పరుగు తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ విజయంపై ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. చేజారిపోయిందనుకున్న మ్యాచ్‌ మళ్లీ తమ చేతుల్లోకి రావడానికి మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ విధ్వసం, హైదరాబాద్ గల్లీ బాయ్ మొహ్మద్ సిరాజ్‌ ఆఖరి ఓవరే కారణం అని చెప్పాడు. ముఖ్యంగా ఏబీకి హ్యాట్పాఫ్‌ చెప్పాడు. ఏబీ బ్యాటింగ్‌ చూస్తుంటే.. ఐదు నెలల నుంచి అతడు కాంపిటేటివ్‌ క్రికెట్‌ ఆడనట్లు లేదని కోహ్లీ ప్రశంసించాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

సిరాజ్‌ సూపర్

సిరాజ్‌ సూపర్

'ఒక దశలో మ్యాచ్ పోయిందనుకున్నా. చేజారిపోయిందనుకున్న మ్యాచ్‌ మళ్లీ మా చేతుల్లోకి రావడానికి కారణం మొహ్మద్ సిరాజ్‌. చివరి ఓవర్ అద్భుతంగా వేశాడు. అతడు ఒక ప్రొఫెషనల్ బౌలర్, తన కర్తవ్యం నిర్వహిస్తాడనే అనుకున్నాం. అదే జరిగింది. ఫీల్డింగ్‌ తప్పిదాలతోనే మ్యాచ్‌ ఇంత దూరం వచ్చింది. మేము బ్యాటింగ్‌ చేసే క్రమంలో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయాం. కానీ ఏబీ డివిలియర్స్‌ ఆఖరి కొన్ని ఓవర్లలో బ్యాట్‌ ఝుళిపించడంతో మళ్లీ రేసులోకి వచ్చాం. చివరి ఓవర్లో 20కి పైగా పరుగులు చేయడం అద్భుతం.అదే మాకు కలిసొచ్చింది' అని విరాట్ కోహ్లీ అన్నాడు.

మ్యాక్సీ 7వ ఆప్షన్‌ మాత్రమే:

మ్యాక్సీ 7వ ఆప్షన్‌ మాత్రమే:

'మేము బౌలింగ్‌ చేసేటప్పుడు షిమ్రాన్ హెట్‌మెయిర్‌ దాటిగా బ్యాటింగ్‌ చేయడంతో మ్యాచ్‌ కోల్పోతున్నాం అనిపించింది. హెట్‌మెయిర్‌ ఇన్నింగ్స్‌ తప్పితే.. మిగతా అంతా మేము బాగానే బౌలింగ్‌ చేశాం. మేము పొడి బంతితో బౌలింగ్‌ చేశాం. డ్యూ మరి ఎక్కువగా లేదు. బంతి పొడిగా ఉండటానికి ఇసుక ఉండటమే కారణం. ఇందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ ఇంకా బౌలింగ్‌ చేయడం లేదు. మ్యాక్సీ మాకు 7వ ఆప్షన్‌ మాత్రమే. మాకు చాలా బౌలింగ్‌ వనరులు ఉన్నాయి. అందుకే అతడికి బౌలింగ్‌ ఇవ్వడం లేదు. మా బ్యాటింగ్‌ లైనప్‌ కూడా చివరి వరకూ బలంగానే ఉంది' అని విరాట్ పేర్కొన్నాడు.

IPL 2021: ప్లీజ్.. మాకు ప్రత్యేక చార్టర్డ్‌ ఫ్లయిట్ ఏర్పాటు చేయండి! వేడుకున్న ఆస్ట్రేలియా ప్లేయర్!

ఏబీకి హ్యాట్పాఫ్‌

ఏబీకి హ్యాట్పాఫ్‌

'ఏబీ డివిలియర్స్‌ సుమారు ఐదు నెలల నుంచి కాంపిటేటివ్‌ క్రికెట్‌ ఆడటం లేదు. చివరగా ఐపీఎల్ 2020 ఆడాడు. కానీ డివిలియర్స్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే.. అతడు అంత కాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడటం లేదని అనిపించదు. ఏబీకి హ్యాట్పాఫ్‌. పదే పదే బ్యాటింగ్‌లో మెరుస్తూ జట్టుకు ఒక ఆస్తిలా మారిపోయాడు.ఇలాంటి ఇన్నింగ్స్ మరిన్ని ఆడుతాడని నాకు నమ్మకం ఉంది' అని విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. బెంగళూరును ఎప్పటిలాగే మరోసారి డివిలియర్స్‌ తన మెరుపు బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. నిలదొక్కుకునే వరకు జాగ్రత్తగా ఆడిన అతను ఆ తర్వాత చెలరేగాడు. 35 బంతుల్లోనే ఏబీ అర్ధ సెంచరీ పూర్తయింది. ఇక ఆఖరి ఓవర్లో 23 పరుగులు పిండుకున్నాడు.

డివిలియర్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

డివిలియర్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీపై బెంగళూరు 1 పరుగు తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్‌ (42 బంతుల్లో 75 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు)హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులకు పరిమితమైంది. షిమ్రాన్ హెట్‌మైర్‌ (25 బంతుల్లో 53 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషబ్‌ పంత్‌ (58 నాటౌట్‌; 6 ఫోర్లు) అజేయ అర్ధ శతకాలతో పోరాడినా ఫలితం లేకపోయింది. డివిలియర్స్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Story first published: Wednesday, April 28, 2021, 9:07 [IST]
Other articles published on Apr 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+