Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్యాంపరింగ్ చేయమని చెప్పింది అతనే..: బాన్‌క్రాఫ్ట్

Bancroft opens up on Warner role in ball-tampering scandal

సిడ్నీ: కొద్ది నెలల పాటు క్రికెట్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది బాల్ ట్యాంపరింగ్ వివాదం. ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను వివాదాన్ని లేపి ఆటగాళ్ల బతుకుల్లో చీకటిని నింపింది. ప్రపంచ క్రికెట్‌ ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లను దోషులుగా నిలబెట్టింది. ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనలో చోటుచేసుకున్న వివాదం క్రికెటర్ల జీవితాలపై చెరగని మచ్చలా మారింది. దీనికి ఫలితంగా ఆ జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌లను ఏడాది పాటు ఆటకు దూరం చేయగా.. యువ ఆటగాడు కామెరాన్‌ బాన్‌క్రాఫ్ట్‌ను 9 నెలలు దూరం చేసింది.

వార్నర్ పాత్రపై నోరువిప్పని ఆసీస్ సహచరులు

వార్నర్ పాత్రపై నోరువిప్పని ఆసీస్ సహచరులు

ఈ ఘటనకు సూత్రదారి డేవిడ్‌ వార్నరేనని అప్పట్లో విచారణ చేసిన క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) దర్యాప్తు బృందం తేల్చిచెప్పింది. కానీ ఇప్పటి వరకు వార్నర్‌ పాత్రపై ఆసీస్ ఆటగాళ్లు నోరు విప్పలేదు. తాజాగా వార్నర్‌ ప్రోద్భలంతోనే తాను బాల్‌ ట్యాంపరింగ్‌కు యత్నించినట్లు ఈ వివాద పాత్రదారి, యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌ తొలిసారి మీడియా వేదికగా అంగీకరించాడు. మరి కొద్ది రోజుల్లో బాన్‌క్రాఫ్ట్‌ తన నిషేధ కాలాన్ని పూర్తి చేసుకోనున్నాడు.

బిగ్ బాష్ లీగ్‌తో బాన్‌క్రాఫ్ట్ పున:ప్రవేశం

బిగ్ బాష్ లీగ్‌తో బాన్‌క్రాఫ్ట్ పున:ప్రవేశం

డిసెంబర్‌ 30 నుంచి ప్రారంభం కానున్న బిగ్‌ బాష్‌ టి20 లీగ్‌తో క్రికెట్‌లోకి పునఃప్రవేశం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో మీడియాతో బాన్‌క్రాఫ్ట్‌ ముచ్చటించాడు. ఆ మ్యాచ్‌లో జరిగిన పరిస్థితుల గురించి గుర్తు చేసుకున్నాడు. అవి తనపై ఎలాంటి ప్రభావం చూపాయో వివరించాడు.

ఆ పరిస్థితుల్లో అది సరైందేననిపించి

ఆ పరిస్థితుల్లో అది సరైందేననిపించి

‘ఆ మ్యాచ్‌ పరిస్థితుల దృష్ట్యా బంతి ఆకారం దెబ్బతీయమని వార్నర్‌ సూచించాడు. అయితే అది మంచిదా.. కాదా? అనే విషయాన్ని గ్రహించలేకపోయాను. ఆ పరిస్థితుల్లో అలా చేయడం సరైందేననిపించింది. కానీ చాలా పెద్ద తప్పు చేశాను. ఈ పని జట్టుపై చాలా ప్రభావం చూపింది.' అని చెప్పుకొచ్చాడు. తనపై బహిష్కరణ వేటు పడ్డాక తన దృక్పథం పూర్తిగా మారిపోయిందని... ఒక దశలో క్రికెట్‌ వదిలేసి యోగా టీచర్‌గా మారిపోదామని అనుకున్నానని ఇటీవల బాన్‌క్రాఫ్ట్‌ తెలిపిన విషయం తెలిసిందే.

కెప్టెన్‌గా తన వైఫల్యమేనని స్మిత్‌

కెప్టెన్‌గా తన వైఫల్యమేనని స్మిత్‌

కొద్ది నెలల తర్వాత మీడియాతో మాట్లాడాడు స్టీవ్ స్మిత్. ట్యాంపరింగ్ చేయమని ఎవరు ఎవరికి చెప్పారో అనే సంగతి మాత్రం బయటపెట్టలేదు. ట్యాంపరింగ్‌ను అడ్డుకోకపోవడం కెప్టెన్‌గా తన వైఫల్యమేనని స్టీవ్‌ స్మిత్‌ ఇటీవల మీడియా ముందు అంగీకరించాడు.

Story first published: Wednesday, December 26, 2018, 11:27 [IST]
Other articles published on Dec 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+