BAN vs SA: ఎమర్జింగ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రిపాన్ మోండోల్, త్షెపో తులి మైదానంలో గొడవకు దిగారు. బంగ్లాదేశ్ ఆటగాడు రిపాన్ మోండల్ సఫారీ బౌలర్ తులి బౌలింగ్‌లో స్ట్రెయిట్ సిక్స్ బాదడంతో ఈ ఘర్షణ జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదంలా ప్రారంభమై.. ఘర్షణ చాలా తీవ్రంగా మారింది. ఇద్దరూ ఒకరినొకరు తోసుకున్నారు. బ్యాటర్‌తో గొడవకు దిగిన తులి అతడిని కొట్టాడు. రిపాన్ మోండోల్ కూడా తిరగబడడంతో గొడవ పెద్దదిగా మారింది. అంపైర్లు జోక్యం చేసుకున్నప్పటికీ ఆటగాళ్లు శాంతించలేదు. అంపైర్లు, మిగతా ఆటగాళ్లు కలగజేసుకుని ఇద్దరినీ విడదీశారు. వారిపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మ్యాచ్ రిఫరీ ఈ ఘటనపై నివేదిక ఇవ్వనున్నాడు. రెండు దేశాల క్రికెట్ బోర్డులు కూడా తదుపరి చర్యలు తీసుకుంటాయి.
గొడవను ప్రారంభించిన సఫారీ బౌలర్
బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఢాకాలో జరుగుతున్న 4 రోజుల మ్యాచ్‌లో బుధవారం రిపాన్ మోండల్, త్షెపో తులి గొడవపడ్డారు. రిపాన్ మోండల్ బంగ్లాదేశ్ జట్టుకు చెందినవాడు కాగా.. త్షెపో తులి దక్షిణాఫ్రికా జట్టుకు చెందినవాడు. త్షెపో తులి బంతికి రిపాన్ మోండోల్ సిక్స్ కొట్టినప్పుడు ఈ ఘటన జరిగింది. సిక్స్ కొట్టిన తర్వాత రిపాన్ మోండోల్.. తులి వైపు చూశాడు. ఇది తులికి కోపం తెప్పించింది. రిపాన్ తన తోటి బ్యాటర్ వైపు వెళ్తుండగా తులి అతని వైపు పరిగెత్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాదన ప్రారంభించింది. అది కాస్త ఘర్షణకు దారితీసింది.

వాదన సమయంలో ఇద్దరు ఆటగాళ్లు కూడా ఒకరినొకరు తోసుకున్నారు. ఒక అంపైర్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ వారు వినలేదు. అప్పుడు మరో అంపైర్, మిగిలిన ఆటగాళ్లు కలిసి వారిద్దరినీ శాంతింపజేశారు. ఈ ఘటన తర్వాత కూడా ఉద్రిక్తత తగ్గలేదు. మూడు బంతుల తర్వాత రిపాన్ కొట్టిన బంతిని తులి ఆపాడు. తులి వెంటనే బంతిని రిపాన్ వైపు విసిరేశాడు. కానీ రిపాన్ బ్యాట్‌తో తనను తాను రక్షించుకున్నాడు. మ్యాచ్ రిఫరీ ఈ ఘటనను ఇరుదేశాల క్రికెట్ బోర్డులకు నివేదించనున్నారు. ఈ విషయంపై రెండు బోర్డులు తదుపరి చర్యలు తీసుకోవచ్చు. ఈ సిరీస్ లో ఇది మొదటి ఘటన కాదు..అంతకు ముందు వన్డే సిరీస్ సమయంలో ఆండిలే సిమెలానే, జీషన్ ఆలంలను కూడా ఒక్కొక్క మ్యాచ్‌కు సస్పెండ్ చేశారు.