Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జస్‌ప్రీత్ బుమ్రా.. టీమిండియాకు పనికిరాడు: మాజీ క్రికెటర్

ఆస్ట్రేలియా పర్యటనలో అసాధారణ బౌలింగ్‌తో ఒంటరి పోరాటం చేసిన టీమిండియా స్టార్ జస్‌ప్రీత్ బుమ్రాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంటే.. మాజీ క్రికెటర్ బల్విందర్ సంధు మాత్రం అతన్ని ఘాటుగా విమర్శించారు. ఒక రోజుకు 15 ఓవర్లు కూడా బౌలింగ్ చేయలేకపోతున్న బుమ్రా.. టీమిండియాకు పనికిరాడని అభిప్రాయపడ్డారు.

వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ థియరీ అనేది పనికిరానిదని, ఈ పద్దతిని తాను అస్సలు అంగీకరించనని తెలిపారు. ఒక రోజుకు కనీసం 20 ఓవర్లు బౌలింగ్ చేయడం పెద్ద కష్టమేమి కాదని, ఒకవేళ అలా వేయలేకపోతే టీమిండియాకు ఆడటం దండగా అన్నాడు.

Balwinder Sandhu dismisses workload management theory regarding Jasprit Bumrah

బుమ్రా ఫిట్‌నెస్‌తో సమస్య..
బౌలింగ్‌లో బుమ్రాకు తిరుగులేదనే చెప్పాలి. అతడి బౌలింగ్ కు వంక పెట్టనక్కర్లేదు. ప్రస్తుత వరల్డ్ క్రికెట్‌లో అతడు కీలక బౌలర్ గా రాణిస్తున్నాడు. కెప్టెన్‌గానూ కొన్ని మ్యాచులతో తానేంటో నిరూపించుకున్నాడు. అయితే వచ్చిన సమస్యల్లా బుమ్రా ఫిట్‌నెస్‌తోనే. ఎందుకంటే అతడు నిత్యం గాయాలతో సావాసం చేస్తుంటాడు.

వైవిధ్యమైన బౌలింగ్ శైలి వల్ల ఈ పేసుగుర్రం ఎప్పుడు గాయపడతాడో చెప్పలేని పరిస్థితి. ఇటీవలే సిడ్నీ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడిన అతడు, పూర్తిగా ఎప్పటికీ కోలుకుంటాడో స్పష్టత లేదు. ఇప్పటికే బ్యాక్ సర్జరీ చేయించుకున్న బుమ్రా కెరీర్‌ను ఎక్కువ కాలం కొనసాగించాలంటే, ఎంతో జాగ్రత్తగా ఉండటం అవసరం.

అందుకే అతడిపై ఎక్కువ పని భారం వేయకుండా అవసరమైన మ్యాచులకు మాత్రమే ఆడిపించేలా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ముందు జాగ్రత్తగా, అతడిని ఇంగ్లాండ్ తో జరగబోయే వైట్ బాల్ సిరీస్ కు విశ్రాంతినిచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

రోజుకు 15 ఓవర్లు వేసాడా..?
ఈ నేపథ్యంలోనే వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ థియరీపై మాజీ క్రికెటర్ బల్విందర్ సింగ్ సంధు విమర్శలు చేశారు. ఒక రోజులో డిఫరెంట్ స్పెల్స్ లో, 15 ఓవర్లు బౌలింగ్ చేయడం పెద్ద కష్టమేమి కాదని అన్నారు. "వర్క్ లోడా?. అతడు (బుమ్రా) ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేశాడు. 150 ఓవర్లు వేసి ఉంటాడా?, ఓ ఐదు మ్యాచులు లేదా 9 ఇన్నింగ్స్ ఆడాడా? కనీసం అతడు ఒక రోజులో 15కు పైగా ఓవర్లు కూడా సరిగ్గా చేయలేదు.

ఒకరోజులో 15 ఓవర్లు చేయడం పెద్ద కష్టమేమి కాదు. మీరేమి వరుసగా ఐదు రోజులు (ఓ టెస్ట్ మ్యాచ్) కూడా బౌలింగ్ చేయట్లేదు. అతడు కేవలం మూడు లేదా నాలుగు స్పెల్స్ మాత్రమే బౌలింగ్ చేస్తున్నాడు.

ఆ విషయాన్ని మర్చిపోండి..
మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడేందుకు బెస్ట్ ఫిజియోలు ఉన్నారు. అద్భుతమైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఎవరైనా గుర్తుపెట్టుకోండి కనీసం రోజుకి 20 ఓవర్లు వేయలేకపోతే టీమ్ ఇండియా ఆడాలన్న విషయాన్ని మర్చిపోండి. అసలు ఈ వర్క్ లోడ్ అనేది ఆస్ట్రేలియన్లు తీసుకొచ్చారు. దీని వల్ల ఏమీ ఉపయోగం లేదు. దీనితో నేను ఏకీభవించలేను. మా రోజుల్లో శరీరాలు క్రికెటర్ల మాట వినేవి.కానీ ఇప్పుడలా లేదు." అని సంధు మండిపడ్డారు.

Story first published: Tuesday, January 7, 2025, 17:40 [IST]
Other articles published on Jan 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+