ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసిన బంతి
లెగ్ స్టంప్ బయట పిచ్ అయిన బాల్.. మెలికలు తిరుగుతూ ఏకంగా ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది. ఏం జరిగిందో అర్థం కాని గ్యాటింగ్‌తోపాటు అంపైర్ కూడా అలా చూస్తుండిపోయారు. ఆసీస్ ప్లేయర్స్ మాత్రం సంబరాల్లో మునిగితేలారు. దీనిని 'బాల్ ఆఫ్ ద సెంచరీ'గా ఆ తర్వాత ఐసీసీ గుర్తించింది. ఈ టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 179 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
8 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా
ఇక, ఈ మ్యాచ్‌లో షేన్ వార్న్ 8 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. 'బాల్ ఆఫ్ ద సెంచరీ' సంఘటన జరగగడానికి ముందు వరకు షేన్ వార్న్ కేవలం 11 టెస్టులాండి 30 వికెట్లు మాత్రమే తీశాడు. 1991లో సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన టెస్టుతో అరంగేట్రం చేసిన షేన్ వార్న్ స్పిన్‌ను ఆ పర్యటనలో భారత క్రికెటర్లు సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరిస్ టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం... ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో 'బాల్ ఆఫ్ ద సెంచరీ' బంతిని వేయడంతో వార్న్ కెరీర్ ఓ మలుపు తిరిగింది.
25 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఐసీసీ ట్వీట్
'బాల్ ఆఫ్ ద సెంచరీ' సంఘటన చోటు చేసుకుని 25 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఇందుకు సంబంధించిన వీడియోని ఐసీసీ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. మరోవైపు షేన్ వార్న్ మాట్లాడుతూ ఆ బంతి కేవలం తన అదృష్టమేనని చెప్పుకొచ్చాడు. 'ప్రతి లెగ్ స్పిన్నర్ వేయాలనుకునే బాల్ అది. నా అదృష్టం.. నేను వేశాను. ఆ బాలే ఫీల్డ్‌లో ఫీల్డ్ బయట నా జీవితాన్ని మొత్తం మార్చేసింది. ఆ తర్వాత అలాంటి బంతి నేను ఎప్పుడూ వేయలేదు' అని వార్న్ చెప్పాడు.
తన బయోగ్రఫీ 'No Spin'ని విడుదల చేసే పనిలో బిజీగా
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే సమయానికి షేన్ వార్న్ 700కుపైగా వికెట్లు తీశాడు. అంతేకాదు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో షేన్ వార్న్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్ 800కుపైగా వికెట్లు తీసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం షేన్ వార్న్ తన బయోగ్రఫీ 'No Spin'ని విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications
