Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాల్ ఆఫ్ ద సెంచరీ పార్ట్ 2: అచ్చం షేన్‌ వార్న్ ‌లాగే!

Ball of the century part 2: Aussie woman legspinner does a Shane Warne in Ashes

హైదరాబాద్: షేన్ వార్న్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో మంది విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ను అలవోకగా పెవిలియన్‌కు చేర్చిన ఆసీస్ స్పిన్నర్. తన బౌలింగ్‌లో ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. ముఖ్యంగా 1993 యాషెస్‌ సిరీస్‌లో మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ మైక్‌ గ్యాటింగ్‌ను ఔట్‌ చేసిన బంతి ఇప్పటికీ ఓ చరిత్రే.

ఆ బంతిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 'బాల్ ఆఫ్ ద సెంచరీ'గా అభివర్ణిస్తారు. ఎన్నో కష్టతరమైన మ్యాచ్‌లను తన బౌలింగ్‌తో మలుపు తిప్పిన సందర్భాలు అనేకం. ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియాను ఛాంపియన్‌గా నిలపడంతో షేవ్ వార్న్ పాత్ర విలువ వెలకట్టలేనిది.

'బాల్ ఆఫ్ ద సెంచరీ' విషయానికి వస్తే షేన్ వార్న్ వేసిన బంతి లెగ్‌స్టంప్‌ వద్ద పిచ్‌ అయి అనూహ్యంగా టర్న్ తీసుకుని ఆఫ్‌స్టంప్‌ను తాకింది. క్రీజులో ఉన్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మైక్ గాటింగ్‌కు అసలు ఏం జరిగిందో అర్థం కాక అలా చూస్తుండిపోయాడు. ఈ బంతికి చూసిన ఏ క్రికెట్ అభిమాని అయినా ఆశ్చర్యానికి గురి కావాల్సిందే.

మళ్లీ 24 ఏళ్ల తర్వాత అదే బంతిని విసిరి ఆశ్చర్యంలో ముంచెత్తింది ఆసీస్‌ మహిళా స్పిన్నర్‌ అమంద-జేడ్‌ విల్లింగ్టన్‌. ఇది కూడా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మహిళల యాషెస్ సిరిస్‌లోనే నమోదు కావడం విశేషం. ఆసీస్ బౌలర్ అమందా వెల్లింగ్టన్ వేసిన లెగ్ బ్రేక్ ఇంగ్లండ్ బ్యాట్స్‌వుమన్ టామీ బ్యూమాంట్‌ను ఔట్ చేసింది.

లెగ్ స్టంప్‌పై పిచ్ అయిన బంతి... అనూహ్యంగా తిరిగి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఈ బంతిని చూసిన అభిమానులంతా షేన్ వార్న్ బాల్ ఆఫ్ ద సెంచరీతో దీనిని పోలుస్తుండటం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందుకు సంబంధించిన వీడియో మీకోసం...

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, November 15, 2017, 17:14 [IST]
Other articles published on Nov 15, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+