హైదరాబాద్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూ బ్రిటిష్ పత్రిక రాసిన కథనంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇలాంటి అర్థంలేని ఆరోపణలు చేయడం కన్నా విశాఖలో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు తన ఓటమిని గౌరవప్రదంగా అంగీకరించి ఉంటే ఆ జట్టు గౌరవం మరింతగా పెరిగేదని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.
గురువారం సెహ్వాగ్ 'హిందూస్తాన్ టైమ్స్'కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ ఓడిపోయే జట్టు ఎప్పుడూ కొన్ని అంశాలు లేవనెత్తి లబ్ధి పొందాలని చూస్తుందని పేర్కొన్నాడు. కాగా, రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లి బంతిని ట్యాంపర్ చేస్తున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వెలుగుచూసింది.
చూయింగమ్ నములుతూ ఉన్న కోహ్లి తన లాలాజలాన్ని బాల్‌కు రుద్ది.. అది మెరిసేలా చేశాడని, ఇది బాల్ ట్యాంపరింగ్‌యేనని ఆరోపిస్తూ బ్రిటన్ మీడియా కథనం రాసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆస్ట్రేలియాతో హోబర్డ్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని అతడికి వంద శాతం జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

విశాఖలో రెండో టెస్టు ముగిసిన అనంతరం బ్రిటిష్ దిన పత్రిక కోహ్లీ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూ రాసిన కథనాలపై సెహ్వాగ్ కాస్తంత ఘాటుగానే స్పందించాడు. 'ఇంగ్లండ్ జట్టు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ ఇంగ్లీషు మీడియానే ఇలాంటి రాతలు రాస్తుంది. ఓటమిని కూడా గౌరవప్రదంగా అంగీకరించాలి. విదేశాల్లో ఓడిపోయినప్పుడు మేం ఎప్పుడూ సాకులు చెప్పలేదు. మేం ఆడలేనందువల్లే ఓడిపోయాం అని మేం గతంలో హుందాగా ఒప్పుకొనేవాళ్లం' అంటూ కోహ్లీపై బ్రిటన్ మీడియాను సెహ్వాగ్ తప్పుబట్టాడు.
ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమిండియా 246 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో టెస్టు సిరిస్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 1-0తో ముందంజలో ఉంది.