Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీఏ శిక్షపై సవాల్ చేయను: బాల్ టాంపరింగ్‌పై స్మిత్ అనూహ్య నిర్ణయం

Ball tampering: Steve Smith accepts CA sanctions

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదంపై ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అభిమానులు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తనపై క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) విధించిన నిషేధ నిర్ణయంపై సవాల్ చేయబోనని స్టీవ్ స్మిత్ ప్రకటించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధాన్ని ఎదుర్కొంటానని తెలిపారు.

ఈ మేరకు స్మిత్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. 'కెప్టెన్‌గా ఈ వివాదంలో పూర్తి బాధ్యత తీసుకుంటానని ఇంతకుముందే చెప్పాను. ఆ మాటకు కట్టుబాడి ఉన్నాను. నేను ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. నాపై విధించిన ఆంక్షలను సవాల్‌ చేయడం లేదు. గట్టి సందేశం ఇచ్చే ఉద్దేశంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ చర్యలు తీసుకుంది. వాటిని నేను ఆమోదిస్తున్నాను' అని ట్వీట్ చేశాడు.

అయితే క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధాన్ని సవాల్ చేసే విషయమై వార్నర్, బాన్‌క్రాప్ట్ ఇంకా స్పందించలేదు. బాల్ టాంపరింగ్ ఘటనలో క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన శిక్ష తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వాళ్లు పాల్పడిన నేరానికి ఈ శిక్ష చాలా ఎక్కువని, అందువల్ల దానిని కాస్త సడలించాల్సిందిగా ఈ ముగ్గురి తరఫు అడ్వైజర్లు సీఏను కోరనున్నారు.

గతంలో బాల్ టాంపరింగ్ వివాదంలో ఈ స్థాయి నిషేధం లేదన్న విషయాన్ని ప్లేయర్స్ యూనియన్ గుర్తు చేసింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు గ్రెడ్ డయర్ మాట్లాడుతూ 'స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్ పట్ల సీఐ ఇంత కఠినంగా వ్యవహరించడం సరి కాదు. గతంలో ఎన్నడూ ఏ ఆటగాడి పట్ల సీఏ ఇలా వ్యవహరించలేదు. గతంలో బాల్ టాంపరింగ్ సందర్భంగా తీసుకున్న చర్యలన్నింటినీ ప్లేయర్స్ అసోసియేషన్ అధ్యయనం చేసింది' అని ఆయన అన్నారు.

'గరిష్టంగా రెండు వన్డేల నిషేధం మాత్రమే విధించనట్లు గుర్తించింది. వీరి విషయంలోనే ఇలా జరిగింది. ఆటగాళ్లకు విధించిన శిక్షను తగ్గించాలి. అలాగే దేశవాళీ క్రికెట్‌లో వారు ఆడేందుకు అనుమతి ఇవ్వాలని త్వరలో సీఏని కలిసి కోరతాం. వీరు చేసింది తప్పే. ఆ తప్పును వారు కూడా ఒప్పుకున్నారు. మీడియా ముందుకు వచ్చి స్వయంగా క్షమాపణలు కోరారు. అలాంటప్పుడు కూడా వారిపై కఠిన శిక్షలు విధించడం న్యాయం కాదు' అని ఆయన అన్నారు.

ఈ ముగ్గురూ దేశవాళీ క్రికెట్‌లోనూ ఆడకపోతే.. నిషేధం ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయని వారు వాదిస్తున్నారు. కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. స్మిత్, వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం విధించగా... బాన్‌క్రాప్ట్‌పై 9 నెలల పాటు నిషేధం విధించింది.

దీంతో పాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది. ఈ వివాదానికి సూత్రధారి అయిన డేవిడ్‌ వార్నర్‌ ఎన్నటికీ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌ కాలేడని సీఏ స్పష్టం చేసింది. అయితే, కెప్టెన్సీ విషయంలో స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌కు ఒకింత ఊరటనిచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్సీని చేపట్టకుండా స్మిత్‌పై రెండేళ్ల నిషేధం విధించింది.

ఈ రెండేళ్ల కాలంలో దేశీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో వీరు కెప్టెన్సీ చేపట్టరాదని పేర్కొంది. అయితే, ఆ తర్వాత క్రికెట్‌ అభిమానుల నుంచి, అధికారుల నుంచి అనుమతి, ఆమోదం ఉంటే జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టవచ్చునని పేర్కొంది. క్రికెట్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోకుండా వీరు క్లబ్‌ క్రికెట్‌ ఆడుకునేందుకు అనుమతించింది.

మరోవైపు బాల్ టాంపరింగ్ వివాదంలో హెడ్ కోచ్ డారెన్ లీమన్ పాత్ర లేదని క్రికెట్ ఆస్ట్రేలియా క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ, కోచ్ పదవికి డారెన్ లీమన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, April 4, 2018, 13:14 [IST]
Other articles published on Apr 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+