Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'అదొక గుణపాఠం లాంటిది, దాని నుంచి చాలా నేర్చుకున్నా'

Ball-tampering saga: I have learnt a valuable lesson, admits David Warner

హైదరాబాద్: కొద్ది రోజుల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసిన విషయం బాల్‌ ట్యాంపరింగ్‌. ఈ వ్యవహారంపై డేవిడ్‌ వార్నర్‌ మరోసారి స్పందించాడు. ఆ ఘటన తనకు జీవితంలో మరిచిపోలేని గుణపాఠం నేర్పిందని చెబుతున్నాడు. కష్టకాలంలో తనకు మద్ధతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో వార్నర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

'క్రికెట్‌ ఆడుతున్నంత కాలం జీవితం ఓ వలయంలా అనిపించేంది. క్రికెట్‌.. ప్రాక్టీస్‌, హోటల్స్‌, ప్యాకింగ్స్‌, ప్రయాణాలు ఇవే ఉండేవి. కుటుంబ సభ్యులతో గడిపేందుకు క్షణం తీరిక దొరికేది కాదు. కానీ, ఇప్పుడు పూర్తిగా పిల్లలతోనే గడుపుతున్నా. నా క్రికెట్‌ ప్రయాణంలో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నా. కానీ, వారి నమ్మకానికి నేను తూట్లు పొడిచా.అయినా వారు కష్టకాలంలో నాకు అండగా నిల్చున్నందుకు కృతజ్ఞుడిని. ఈ అనుభవాల నుంచి విలువైన పాఠాలు నేర్చుకున్నానని భావిస్తున్నా. ఇకపై ఇతరులకు సాయం చేయటానికి నా వంతు కృషి చేస్తా' అని వార్నర్‌ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

దీంతో పాటు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఆస్ట్రేలియాకు రెండేళ్ల పాటు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా కూడా నిషేధం విధించింది. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధంపై ఈ ముగ్గురు ఆటగాళ్లు మరోసారి అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. అయితే, బంతి ఆకారాన్ని మార్చేందుకు టేప్‌ను కాకుండా సాండ్‌పేపర్‌ను (గరుకైన కాగితాన్ని) ఉపయోగించినట్టు తమ విచారణలో తేలినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు సిద్దపడని వార్నర్, స్మిత్‌లు నిషేదంపై అప్పీలు చేసుకోలేదు.

Story first published: Sunday, May 6, 2018, 13:09 [IST]
Other articles published on May 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+