
డుప్లెసిస్ తాజా అప్పీల్‌పై ఐసీసీ అసంతృప్తి
అంతేకాదు డుప్లెసిస్ తాజా అప్పీల్‌పై ఐసీసీ మరోసారి తన సభ్యులతో సమీక్షించనుంది. మరోవైపు రెండో టెస్టులో తాను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు ఐసీసీ నిర్ధారించడాన్ని దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డుప్లెసిస్ తప్పుబట్టాడు. తాను కావాలని ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశాడు.

ఐసీసీ తీసుకున్న నిర్ణయం తప్పు
తనపై ఐసీసీ తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పాడు. అంతేకాదు ఐసీసీ తనపై తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించబోనని పేర్కొన్నాడు. తాను బాల్ ట్యాంపరింగ్ చేసినట్లు వాదనలు జరగడం, ఆపై తాను తప్పి చేసినట్లు తేలాయి. దానికి తాను ఏకీభవించానని తెలిపాడు.

ఎటువంటి తప్పు చేయలేదు
అయితే తాను ఎటువంటి తప్పు చేయలేదని, బంతికి మెరుపు తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చాడు. అయితే దానిని ఐసీసీ ట్యాంపరింగ్ చేశానని అంటోంది. ఒకవేళ బాల్ ట్యాంపరింగ్ చేసినట్లైతే బంతిని గీకడం వంటి చర్యలకు పాల్పడాలని, కానీ తాను అటువంటి చర్యలకు పాల్పడలేదని పేర్కొన్నాడు.

కృత్రిమ చర్యలతో బంతిపై మెరుపు రాదు
అంతేకాదు బంతి మెరుపుకు సంబంధించి క్రికెటర్లు అందరికీ ఒకే అభిప్రాయం ఉండదని చెప్పుకొచ్చాడు. మనం చేసే కొన్ని కృత్రిమమైన చర్యలతో బంతిపై మెరుపు రాదని అన్నాడు. ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్లు చాలా సార్లు చెప్పారని పేర్కొన్నాడు. ఈ రకంగా చేస్తే బంతిపై మరింత మెరుపు వస్తుందని ఐసీసీ ఎక్కడా కూడా రికార్డుల్లో రాయలేదని, దాంతో తాను మోసానికి పాల్పడలేదని చెప్పాడు.


Click it and Unblock the Notifications