
హైదరాబాద్: మార్చి 24వ తేదీ జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్ క్రికెట్‌లోనే ఓ మేలుకొలుపు వంటిదని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వెస్ కలిస్ పేర్కొన్నాడు. బాల్ టాంపరింగ్‌కు పాల్పడినందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ సంఘం కఠినమైన శిక్షలే విధించింది. ఈ సంఘటనను ఉద్దేశిచి అంతర్జాతీయ క్రికెట్‌కు ఓ మేల్కొలుపు అని అన్నాడు.
కొన్ని రోజులుగా మీడియాలో ఈ విషయమై..పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. జరిగిపోయిన విషయం గురించి చర్చించి చాలామంది సమయాన్ని వృథా చేస్తున్నారని విస్తుపోయాడు. ఈ సంఘటన ఇతర ఆటగాళ్లకు హెచ్చరిక లాంటిదని తెలిపాడు. ప్రతి ఆటగాడు క్రీడాస్ఫూర్తితో మెలగాల్సి ఉందని గుర్తుచేస్తోందని కొనియాడాడు.
అసలు టాంపరింగ్ వివాదమేమంటే.. దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ జరుగుతుండగా.. బౌలర్ బెన్‌క్రాఫ్ట్‌తో కలిసి స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు బాల్ టాంపరింగ్ పాల్పడుతూ కెమెరాలకి దొరికిపోయిన విషయం తెలిసిందే. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్, వార్నర్‌లపై ఏడాది, బ్రాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలలు నిషేధం విధించింది.
ఈ మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. తన జట్టు ఆటగాళ్లందరికీ కష్టపడి ఆడాలని, ఆటలో న్యాయంగా ఉండాలని సూచించినట్లు తెలిపాడు. రానున్న ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఏప్రిల్ 8న... ఈడెన్ గార్డెన్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో తన తొలి మ్యాచ్ ఆడనుంది.
42 ఏళ్ల కల్లిస్ తన క్రికెట్ కెరీర్‌లో... 166 టెస్ట్ మ్యాచులు, 328 వన్డే మ్యాచులు ఆడాడు. 13 వేలకు పైగా పరుగులు రాబట్టాడు. బౌలింగ్‌లోనూ ప్రతిభ చాటి 292 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.