వార్నర్ ట్యాంపరింగ్‌కు పాల్పడటానికి కారణం నేనే: వార్నర్ భార్య

Posted By:
 Ball-tampering crisis my fault, its killing me, says David Warners wife Candice

హైదరాబాద్: ఎనిమిది రోజుల క్రితం జరిగిన దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టు మ్యాచ్‌లో జరిగిన బాల్‌ ట్యాంపరింగ్‌ సంచలనం రేపింది. అయితే ఈ ఘటన తనవల్లే జరిగిందంటూ ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ భార్య క్యాండిస్‌ వార్నర్‌ తెలిపారు.

సిడ్నీ సండే టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ.. ఈ ఘటనకంతా తానే కారణమని, ఈ బాధ తనను మానసికంగా చంపేస్తోందనే ఆవేదనను వ్యక్తం చేశారు. అదే సమయంలో భర్త తప్పిదాన్ని సమర్ధించడం లేదని, కానీ వార్నర్‌ తన భార్య, పిల్లలను రక్షించుకునే ప్రయత్నంలో మాత్రమే అలా చేశాడన్నారు. అభిమానులు, ప్రత్యర్ధి ఆటగాళ్లు తన మీద జోకులు వేస్తూ.. వార్నర్‌కు ఆగ్రహం తెప్పించేలా చేశారని, ఇవే వార్నర్‌ను మానసికంగా దెబ్బతీసాయని క్యాండిస్‌ చెప్పుకొచ్చారు.

వార్నర్‌ భార్య క్యాండిస్‌, న్యూజిలాండ్‌ రగ్బీ స్టార్‌ సోని బిల్‌ విలియమ్స్‌కు ఎఫైర్‌ ఉందని, 2007లో సిడ్నీలో వీరు గడిపారనే పుకార్లను మైదానంలో సఫారీ వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డీ కాక్‌ వార్నర్‌ను రెచ్చగొట్టేలా ప్రస్తావించాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా అభిమానులు కూడా ఈ ఎఫైర్‌ గురించి మైదానంలో వ్యాఖ్యలు చేయడం, సోని బిల్‌ మాస్కులు ధరించి రావడం వార్నర్‌ మానసిక స్థితిని మరింత గాయపరిచింది.

ఈ నేపథ్యంలోనే వార్నర్‌ ఓటమి నుంచి తప్పించుకునేందుకు బాల్‌ ట్యాంపరింగ్‌కు యత్నించాడని క్యాండిస్‌ వెనుకేసుకొచ్చారు. వార్నర్‌ ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఆసీస్‌ అభిమానులు సానుభూతి కనబరుస్తూ కొంత ఓపికతో ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Sunday, April 1, 2018, 14:58 [IST]
Other articles published on Apr 1, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి