న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'జట్టు బ్యాలెన్స్‌ కావడంలో పాండ్యా పాత్ర కీలకం'

India vs Australia : Hardik Pandya Gave Much Support To Team : Shikar Dhawan | Oneindia Telugu
Balance that Pandya creates is crucial for team: Dhawan

హైదరాబాద్: భారత జట్టులో సమతుల్యత రావడంలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యా కీలక పాత్ర పోషించాడని ఓపెనర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. 'కాఫీ విత్‌ కరణ్‌' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి భారత క్రికెటర్లు పాండ్యా, రాహుల్‌లు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

<strong>ప్రేమలో పడిన పంత్!: అమ్మాయి ఎవరో తెలుసా? (ఫోటోలు)</strong>ప్రేమలో పడిన పంత్!: అమ్మాయి ఎవరో తెలుసా? (ఫోటోలు)

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జనవరి 18న చివరి వన్డే మెల్ బోర్న్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో గురువారం శిఖర్ ధావన్ మాట్లాడుతూ "పాండ్యా జట్టులోకి వచ్చిన తర్వాత సమతుల్యత ఏర్పడింది. భారత జట్టు బ్యాలెన్స్‌ కావడంలో పాండ్యా పాత్ర కీలకం. పాండ్యా జట్టులో చేరిన దగ్గర్నుంచీ మా జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడు" అని అన్నాడు.

మరోవైపు ఇటీవలే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పేసర్లు మహ్మద్‌ సిరాజ్‌, ఖలీల్‌ అహ్మద్‌లపై కూడా పాండ్యా స్పందించాడు. వారిద్దరూ ఇంకా యువ క్రికెటర్లేనని, వారు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారని ధావన్ చెప్పుకొచ్చాడు. రాబోవు కాలంలో ఆ ఇద్దరూ మరింత పరిణితి సాధిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం భారత బౌలింగ్‌ యూనిట్‌కు సంబంధించి ఎటువంటి ఆందోళన లేదని ధావన్ అన్నాడు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించింన సంగతి తెలిసిందే. దాంతో సిరీస్‌ 1-1తో సమం అయింది. శుక‍్రవారం ఇరు జట్ల మధ్య మెల్‌బోర్న్‌ వేదికగా సిరీస్‌ విజేత ఎవరో నిర్ణయించే మూడో వన్డే జరుగనుంది.

Story first published: Thursday, January 17, 2019, 15:00 [IST]
Other articles published on Jan 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X