
ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు.. 15మంది ప్లేయర్లతో కూడిన టీమ్‌ను వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లాండ్ టీంకు బిగ్ షాక్ తగిలింది. ఈ జట్టుకు ఎంపికైన ఆ జట్టు స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇటీవల లీడ్స్‌లో గోల్ఫ్ ఆడుతున్నప్పుడు తనకు గాయమైందని, అందువల్ల టోర్నమెంట్ నుంచి వైదొలిగాల్సి వస్తోందని పేర్కొన్నాడు. దీంతో లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్‌లో సెప్టెంబర్ 8న ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే 3వ టెస్టుకు కూడా బెయిర్‌స్టో దూరం కానున్నాడు.
'లీడ్స్‌లో శుక్రవారం గోల్ఫ్ ఆడుతున్నప్పుడు బెయిర్‌స్టో ఒక ప్రమాదానికి గురయ్యాయి. అతనికి లెగ్ ఇంజూరీ అయింది.' అని ఈసీబీ కూడా ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే వచ్చే గురువారం నుంచి కియా ఓవల్‌లో జరగనున్న మూడో టెస్టు కోసం బెన్ డకెట్‌ను అతని స్థానంలో టెస్టు జట్టులోకి తీసుకున్నారు. ఇకపోతే జానీ బెయిర్ స్టో సైతం ఈ విషయమై స్పందించాడు. 'నేను కొన్ని నెలల పాటు అన్ని టోర్నీలకు మ్యాచ్‌లకు దూరం కానున్నాను. అనుకోకుండా లీడ్స్ గోల్ఫ్ కోర్సు ఆడుతున్నప్పుడు మైదానంలో స్లిప్ అయ్యాను. అందువల్ల నా కాలి కింది భాగంలో తీవ్ర గాయమైంది. ఫలితంగా సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని వెల్లడించడానికి చాలా బాధపడుతున్నాను. టీ20 వరల్డ్ కప్ ఆడబోయే మా జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను.' అంటూ జానీ వెల్లడించాడు. ఇక జానీ దూరం కాగా అతని స్థానంలో తిరిగి జాసన్ రాయ్‌ను తీసుకుంటారో లేక మరో ప్లేయర్‌ను తీసుకుంటారో అనేది తేలాల్సి ఉంది.
బెయిర్ స్టో వైదొలిగాక టీ20 వరల్డ్‌కప్ ఇంగ్లాండ్ జట్టు ఇదే..
జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టొన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.
రిచర్వ్డ్ ప్లేయర్లు: టైమల్ మిల్స్, లియామ్ డాసన్, రిచర్డ్ గ్లీసన్