Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గుత్తా జ్వాల ప్రవర్తనపై లైఫ్ బ్యాన్? క్షమాపణకు నో!

Jwala Gutta
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్‌లో దుమారం చెలరేగుతోంది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబిఎల్) సందర్భంగా తమ ఫ్రాంఛైజీ క్రిష్ ఢిల్లీ ఆటగాళ్లను బంగా బీట్స్‌తో మ్యాచ్ ఆడకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించింద్న ఆరోపణల నేపథ్యంలో గుత్తా జ్వాలపై జీవిత కాలం నిషేధం విధించాలని బాయ్(భారత బ్యాడ్మింటన్ సంఘం) సూచించింది.

ఐబిఎల్‌లో వివాదానికి కారణమైనందుకు జ్వాలను జీవితకాలం నిషేధించాలని లేదా కొంతకాలం సస్పెండ్ చేయాలని క్రమశిక్షణ సంఘం సూచించింది. ప్రతిపాదనను సంఘం సభ్యులకు పంపించామని ఐతే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సూచనలను ఇంకా అమలు చేయలేదని బాయ్ చెబుతోంది. మరోవైపు జ్వాలా గుత్తా భేషరతుగా క్షమాపణ చెబితే ఆమెపై ఎలాంటి చర్యలు ఉండవని కూడా చెబుతున్నారు.

కాగా, ఐబిఎల్ సందర్భంగా బంగా బీట్స్‌తో మ్యాచులో ఆడొద్దంటూ తన ఢిల్లీ స్మాషర్స్ సహచరులను జ్వాలా గుత్తా రెచ్చగొట్టిందనే ఆరోపణలపై బాయ్ వివరణ ఇవ్వాలంటూ ఆమెకు అప్పుడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

మరోవైపు గుత్తా జ్వాలపై జీవితకాల నిషేధం విధించాలని భారత బ్యాడ్మింటన్ సంఘం, క్రమశిక్షణ సంఘం సూచించడాన్ని జ్వాలా కోచ్ ఆరిఫ్ ఆక్షేపించారు. ఏ తప్పు చేయని జ్వాల ఎందుకు క్షమాపణలు కోరాలని ప్రశ్నించారు. జీవితకాల నిషేధం నోటీసులు అందితే ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకోవాలని జ్వాలాకు సూచించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+