Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెంటాడుతున్న మ్యాచ్ ఫిక్సింగ్: అజరుద్దీన్ కు చుక్కెదురు

Mohammed Azharuddin
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ బిడ్ రిగ్గింగ్ వివాదం, దశాబ్దం కిందటి మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం ఇప్పుడు భారత బాడ్మింటన్ ను వెంటాడుతోంది. భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ టాప్ పోస్టుకు మాజీ క్రికెటర్, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మొహమ్మద్ అజరుద్దీన్ అభ్యర్థిత్వాన్ని మెజారిటీ రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. 28 రాష్ట్రాల బ్యాడ్మింటన్ సంఘాల్లో 22 సంఘాలు అజరుద్దీన్ ను వ్యతిరేకిస్తున్నాయి.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో బిసిసిఐ జీవిత కాలం నిషేధం విధించినందున బాయ్ పదవికి అజరుద్దీన్ పేరు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని మెజారిటీ రాష్ట్ర సంఘాలు లేఖలు రాశాయి. బాయ్ చీఫ్ పదవికి తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు అజర్ వారం రోజుల క్రితం ప్రకటించారు. ఈ నెల 13వ తేదీన బాయ్ చీఫ్ పదవికి ఆయన నామినేషన్ క్రీడా సమాఖ్య వార్షిక సర్వసభ్య సమావేశం ముందుకు రానుంది. అవసరమైతే ఆ పదవికి అదే రోజు ఎన్నికలు జరుగుతాయి.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+