Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Prithvi Shaw: ఆ సాయిబాబా కరుణించలేదు.. పృథ్వీ షా గాయంపై బ్యాడ్ న్యూస్ చెప్పిన డాక్టర్లు!

టీమిండియా విధ్వంసకర ఓపెనర్ పృథ్వీ షాను ఆ సాయిబాబా కరుణించలేదు. చివరగా న్యూజిల్యాండ్‌తో టీ20 సిరీసులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ షాకు మళ్లీ టీమిండియా నుంచి పిలుపు అందలేదు. దీంతో కౌంటీల్లో ఆడాలని డిసైడ్ అయిన పృథ్వీ.. నార్తంప్టన్‌షైర్ తరఫున అదిరిపోయే అరంగేట్రం చేశాడు. కౌంటీ వన్డే కప్‌లో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

అదే జోరుతో మరో సెంచరీ కూడా బాదాడు. కానీ ఆ తర్వాత సడెన్‌గా మోకాలి గాయంతో క్రికెట్‌కు దూరమయ్యాడు. దీంతో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)కు చేరుకున్నాడీ 23 ఏళ్ల స్టార్ క్రికెటర్. ఆంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయం వల్ల అతను నార్తంప్టన్‌షైర్ తరఫున పూర్తి వన్డే కప్ ఆడకుండానే వచ్చేసిన సంగతి తెలిసిందే.

Prithvi Shaw

ఈ గాయం మరీ సీరియస్ అవ్వకముందే పృథ్వీ షా.. తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. కానీ తాజా అప్‌డేట్ ప్రకారం అతను కనీసం మూడు, నాలుగు నెలలపాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వస్తుందట. దీంతో దేశవాళీ సీజన్‌లో కూడా కొంత భాగానికి పృథ్వీ షా దూరమవక తప్పేలా లేదు. అక్టోబర్ 1 నుంచి జరిగే ఇరానీ కప్‌తో ఈ డొమెస్టిక్ సీజన్ మొదలవుతుంది. తన గాయం గురించి తెలియగానే ముందుగా లండన్‌లోని ఒక సర్జన్‌ను షా కలిశాడట.

ఆ తర్వాత ఎన్సీయేకు వచ్చేసినట్లు సమాచారం. సాధ్యమైనంత వరకు సర్జరీ లేకుండానే షా కోలుకునేలా మెడికల్ టీం చర్యలు తీసుకుంటోందట. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి ఎదురైతే తప్ప సర్జరీ జోలికి వెళ్లకూడదని వాళ్ల అభిప్రాయం. ఈ విషయంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ ఫోకస్ పెట్టిందని, పరిస్థితిని బట్టి షా విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

ప్రస్తుతం అతని పరిస్థితి బట్టి చూస్తే అక్టోబర్, నవంబరులో మొదలయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌కు పృథ్వీ షా దూరమవడం గ్యారంటీగా కనిపిస్తోంది. అతను కనుక అనుకున్న సమయానికి కోలుకుంటే.. ముంబై రంజీ టీంలో చోటు సంపాదించే అవకాశం ఉంటుంది. లేదంటే రంజీ ట్రోఫీకి కూడా దూరమయ్యే అవకాశం ఉంది.

Story first published: Thursday, September 14, 2023, 14:03 [IST]
Other articles published on Sep 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+