Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇది అసలైన RCB దరిద్రం.. చెత్త నిర్ణయంతో మరోసారి బలి!

ఐపీఎల్‌లో బ్యాడ్ లక్‌కు కేరాఫ్ అడ్రస్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ట్రోల్ చేస్తుంటారు. జట్టులో గేమ్ ఛేంజర్స్‌కు కొదవ ఉండదు, అయినా ఒక్కసారి కూడా టైటిల్‌ను అందుకోలేకపోయింది. గత 16 సీజన్లలోనూ ఫేవరేట్ జట్టుగానే బరిలోకి దిగింది. ఈ సాలా కప్ నమదే నినాదాలతో సీజన్లను మొదలుపెట్టింది. కానీ చివరికీ అదే నిరాశతో ఇంటిముఖం పట్టడమే రిపీట్ అయ్యింది.

అయితే ఆర్సీబీ ఫ్రాంచైజీ నిర్ణయాలు కూడా జట్టుకు చేటు చేస్తున్నాయి. రిటైన్డ్‌కు ముందు ఆటగాళ్లను వదిలిపెట్టడంలో, వేలంలో ప్లేయర్లు కొనుగోలు చేయడంలో మేనేజ్మెంట్ అనుసరించే వ్యూహాలు తీవ్ర విమర్శలపాలవుతున్నాయి. వాళ్లు వదిలిపెట్టిన ఆటగాళ్లు సూపర్ ఫామ్‌లోకి రావడం, రూ.కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ప్లేయర్లు నిరాశపరచడం.. ఆర్సీబీకీ సర్వ సాధారణంగా మారింది. తాజాగా దాన్ని నిజం చేస్తూ న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ సంచలన ప్రదర్శన చేస్తున్నాడు.

Bad luck for RCB. Its worst decision about Finn Allen

ఇటీవల ఫిన్ అలెన్‌ను వేలానికి ముందు ఆర్సీబీ వదులుకున్న విషయం తెలిసిందే. అయితే అతడు పాకిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తొలి టీ20లో 15 బంతుల్లో 31 పరుగులు, రెండో మ్యాచ్‌లో 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇవాళ జరిగిన మూడో టీ20లో 62 బంతుల్లో ఏకంగా 137 పరుగులు సాధించాడు. తనని వదులుకోవడం ఆర్సీబీ తీసుకున్న చెత్త నిర్ణయం అనేలా విజృంభిస్తున్నాడు.

అయితే బెంగళూరు వదులుకోవడంతో కనీస ధర రూ.75 లక్షలతో వేలానికి వచ్చిన ఫిన్ అలెన్‌ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అతడి కోసం ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. మరోవైపు ఇటీవల ఆర్సీబీ వదులుకున్న హసరంగ, హేజిల్‌వుడ్, మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు.

వేలానికి ముందు ఆర్సీబీ వదులుకున్న ఆటగాళ్లు: హసరంగ, హర్షల్‌ పటేల్, హేజిల్‌వుడ్‌, ఫిన్‌ అలెన్‌, బ్రేస్‌వెల్‌, విల్లీ, పార్నెల్‌, సోను యాదవ్‌, షాబాజ్‌ అహ్మద్‌, అవినాశ్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, కేదార్‌ జాదవ్‌

వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు: అల్జారి జోషెఫ్‌ (రూ. 11.50 కోట్లు), యశ్‌ దయాల్‌ (రూ. 5 కోట్లు), ఫెర్గూసన్‌ (రూ. 2 కోట్లు), టామ్‌ కరన్‌ (రూ. 1.50 కోట్లు), సౌరభ్‌ చౌహాన్‌ (రూ. 20 లక్షలు), స్వప్నిల్‌ సింగ్‌ (రూ. 20 లక్షలు)

వేలానికి ముందు ఆర్సీబీ అంటిపెట్టుకున్న ఆటగాళ్లు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, కామెరాన్ గ్రీన్ (ట్రేడెడ్), రజత్ పటిదార్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్ (ట్రేడెడ్), ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, విజయ్ కుమార్ వైషాక్

Story first published: Wednesday, January 17, 2024, 17:01 [IST]
Other articles published on Jan 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+