రోహిత్‌ను వెంటాడుతున్న బ్యాడ్ లక్.. ఇప్పట్లో ఆ అదృష్టం లేనట్లే

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ మధ్య టైం ఏం బాగాలేనట్టుంది. కెప్టెన్‌గా ప్రమోషన్ వచ్చినప్పటికీ దానిని అనుభవించే అదృష్టం హిట్‌మ్యాన్‌కు ఇప్పట్లో దక్కేలా లేదు. దీనికి అతని తొడ కండరాల గాయమే కారణం. టీ20 వరల్డ్‌కప్ అనంతరం రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించిన సెలెక్టర్లు.. తర్వాత కొద్ది రోజులకే వన్డే కెప్టెన్సీ కూడా అప్పగించారు. అంతేకాకుండా టెస్టులకు వైస్ కెప్టెన్‌గా కూడా నియమించారు. ఇంకేముంది టీమిండియాలో రోహిత్ శకం మొదలైందని అంతా అనుకున్నారు. దీనికి తోడు టీ20ల్లో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న హిట్‌మ్యాన్ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను క్వీన్‌స్వీప్ చేసి తన సత్తాను నిరూపించుకున్నాడు. అదే ఊపులో సౌతాఫ్రికా పర్యటనకు ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.

రోహిత్ కొంప ముంచిన ప్రాక్టీస్
కానీ ఎవరూ ఊహించని విధంగా ఆ ప్రాక్టీసే హిట్‌మ్యాన్ కొంపముంచింది. ప్రాక్టీస్‌లో తొండకండరాలు పట్టేశాయి. స్కానింగ్‌లో గాయం పెద్దదని తేలడంతో నిరాశ తప్పలేదు. దీంతో రోహిత్ సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. వెంటనే బెంగళూరులోని ఎన్‌సీఏకు వెళ్లి చికిత్స తీసుకుంటూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. అయితే టెస్ట్ సిరీస్ అయిపోయే లోపు కోలుకోని వన్డే సిరీస్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడని అంతా భావించారు.

ప్రయోగాలకు మొగ్గు చూపని సెలెక్టర్లు
కానీ రోహిత్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో భవిష్యత్ దృష్యా అతనితో ప్రయోగాలు చేయడానికి సెలెక్టర్లు మొగ్గుచూపలేదు. దీంతో హిట్‌మ్యాన్ వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఒకానొక దశలో రోహిత్ కోలుకున్నాడనే వార్తలు కూడా వచ్చినప్పటికీ అవి నిజం కాలేదు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడానికి మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. రోహిత్ శర్మ అభిమానులకు మరికొంత కాలం ఎదురుచూపులు తప్పడం లేదు.

కుర్రాళ్లకు పాఠాలు
ఓ వైపు ఎన్‌సీఏలో కోలుకుంటూనే అక్కడే ఉన్న భారత అండర్ 19 ఆటగాళ్లకు రోహిత్ శర్మ తన అనుభవాన్ని అంతా ఉపయోగించి విలువైన పాఠాలను చెప్పాడు. కాగా భారత అండర్ 19 జట్టు శుక్రవారం ఆసియా కప్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ట్రోఫి గెలుచుకుంది.

గతంలో కూడా..
రోహిత్‌కు తొడ కండరాల గాయం ఇది మొదటి సారి ఏం కాదు. గతంలో కూడా ఇదే గాయంతో హిట్‌మ్యాన్ పలు మార్లు జట్టుకు దూరమయ్యాడు. 2020లో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. అయితే వన్డే, టెస్ట్ సిరీస్‌కు తొడ కండరాల గాయంతో దూరమయ్యాడు. దీంతో ఆ రెండు సిరీస్‌ల్లో భారత జట్టు ఓటమి పాలైంది. అంతేకాకుండా 2020 చివర్లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలోని తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు కూడా హిట్‌మ్యాన్ ఇదే కారణంతో దూరమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications