హైదరాబాద్: స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ ఈ ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. సన్ రైజర్స్ తరఫున మరో రెండు రోజుల తర్వాత అంటే.. శుక్రవారం నాడు అతను తొలిసారి బరిలోకి దిగబోతున్నాడు. ట్వంటీ 20 ప్రపంచకప్ సందర్భంగా యువీ గాయపడ్డాడు.
దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన తొలి ఏడు మ్యాచ్‌లకు అతను దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న యువరాజ్.. గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించాడు. మే ఆరో తేదీ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు.

అప్పటికి నేను మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధంగా ఉంటానని ఆశిస్తున్నానని, తాను ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని, కానీ ఆరో తారీఖు మ్యాచ్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. వైద్యుడు తన పరిస్థితి చూసి శుక్రవారం మ్యాచ్ ఆడేందుకు అవకాశాలున్నాయని చెప్పాడని యువీ తెలిపాడు.
మంగళవారం యువీ హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీని సందర్శించడంతో పాటు గోకార్టింగ్ రేసులో కూడా పాల్గొన్నాడు. సన్‌రైజర్స్ ఆటగాళ్లతో కలిసి గోకార్టింగ్ సరదాగా చాువగేబవ, ఈ సీజన్లో తన తొలి మ్యాచ్‌కు ఇంకో మూడు రోజుల సమయముందని, అప్పటిదాకా ఆగలేకపోతున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.