Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టిమ్ పైన్ పిల్లలను ఆడించిన రిషబ్ పంత్: సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Rishabh Pant Meets Tim Paine's Wife Bonnie Paine And Kids
Babysitter Rishabh Pant meets Tim Paines wife Bonnie Paine and kids, picture goes viral on social media

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఈ స్లెడ్జింగ్ తక్కువగానే కనిపించినప్పటికీ, మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం మరింత తీవ్రరూపం దాల్చింది.

బాక్సింగ్ డే టెస్టులో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు ఒకరిపై మరొకరు వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసుకున్నారు. క్రీజులో పాతుకుపోయిన నిలకడగా ఆడుతోన్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పంత్ సైతం పైన్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు.

పంత్-పైన్‌ల మధ్య నడిచిన మాటల యుద్ధం

పంత్-పైన్‌ల మధ్య నడిచిన మాటల యుద్ధం

వీరిద్దరి మధ్య నడిచిన మాటల యుద్ధంపై అటు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో తెగ్ ట్రోల్ చేశారు. దీంతో ఆటగాళ్ల మధ్య చోటు చేసుకున్న ఈ స్లెడ్జింగ్‌ మరే వివాదానికి దారితీస్తుందో అని క్రికెట్‌ అభిమానులు కవలవరపడ్డారు. అయితే, ఇదంతా ఆటలో భాగమేనని, మైదానం దాటితే తామంతా మంచి స్నేహితులమని పంత్‌ నిరూపించాడు.

టిమ్ పైన్ పిల్లలను ఆడించిన పంత్

మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో "పంత్‌.. నా పిల్లలను ఆడించు.. నేను నా భార్యను సినిమాకు తీసుకెళ్తా" అని సరదాగా అన్న వ్యాఖ్యలను పంత్‌ సీరియస్‌గా తీసుకున్నాడో ఏమో కానీ అతను అన్నట్లే టిమ్ పైన్‌ భార్య బొనీ పైన్‌ను కలిసి వారి పిల్లలను ఆడించాడు. ఈ విషయాన్ని బొనీ పైన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.

పంత్ బెస్ట్‌ బేబీసిట్టర్‌

దీంతో పాటు పంత్ బెస్ట్‌ బేబీసిట్టర్‌ అని ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాక్సింగ్ డే టెస్టులో ధోనీ పేరుని ప్రస్తావిస్తూ రిషబ్ పంత్‌ని టిమ్ పైన్ కవ్వించాడు. "ధోనీ మళ్లీ వికెట్ కీపర్‌గా భారత వన్డే, టీ20 జట్టులోకి వచ్చేశాడు. కాబట్టి, నిన్ను బిగ్‌బాష్ టోర్నీలోని హాబర్ట్ హారికేన్స్ టీమ్‌‌లోకి తీసుకుంటా. ఈ డీల్‌ ఓకే అయితే బాగుంటుంది కదా?" అంటూ పంత్ ఏకాగ్రతని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు.

నోటికి పని చెప్పిన రిషబ్ పంత్

ఆ తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ తన నోటికి పనిచెప్పాడు. "మయాంక్ అగర్వాల్.. ఈరోజు మన ప్రత్యేక అతిథి వచ్చేశాడు. నువ్వు ఎప్పుడైనా తాత్కాలిక కెప్టెన్ పదం విన్నావా? అతడ్ని ఔట్ చేయాలంటే నువ్వు ఏం చేయాల్సిన పనిలేదు. అతను మాట్లాడటాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. ఇంకా చెప్పాలంటే.. అతను మాట్లాడటం మాత్రమే చేయగలడు" అని టిమ్‌పైన్‌ని ఉద్దేశిస్తూ షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మయాంక్ అగర్వాల్‌‌కి చెప్తున్నట్లు రిషబ్ పంత్ కవ్వించాడు.

ఆస్టేలియా ప్రధాని నివాసంలో కోహ్లీసేన

కాగా, ఈ సిరిస్‌లో చివరిదైన నాలుగు టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ సిరిస్ అనంతరం ఇరు జట్ల మధ్య జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. కొత్త ఏడాదిని పురస్కరించుకుని ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా జట్టుని ఆ దేశ ప్రధాని ప్రత్యేక విందుకు ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసింది.

1
43625
Story first published: Tuesday, January 1, 2019, 15:21 [IST]
Other articles published on Jan 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+