For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Babar Azam Records: కెప్టెన్‌గా ఆ విషయంలో కోహ్లీని మించిపోయిన బాబర్ ఆజామ్

Babur Azam completed 1000 runs in ODIs in just 13 innings, Broke Kohli (17 Innings) Record

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ పాక్‌లోని ముల్తాన్‌లో జరగగా.. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ టీం నిర్ణీత 50ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 305పరుగులు చేసింది. ఓపెనర్ షై హోప్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక 306పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ (61 బంతుల్లో 59పరుగులు), ఖుష్‌దిల్ షా (23 బంతుల్లో 41 పరుగులు), ఇమాముల్ హక్ (71బంతుల్లో 65) రాణించగా.. కెప్టెన్ బాబర్ ఆజామ్ (107 బంతుల్లో 103 పరుగులు) సెంచరీతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి ఇది 17వ సెంచరీ. ఇక తన చివరి అయిదు వన్డేల్లో ఆజామ్ నాలుగు సెంచరీలు బాదాడు. చివరి అయిదు వన్డేల్లో 158, 57, 114, 105, 103 పరుగులు చేశాడు. దీన్ని బట్టి అతని ఫామ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వరుసగా ఇది అతనికి హ్యాట్రిక్ సెంచరీ కావడం విశేషం.

ఇకపోతే బాబర్ ఆజామ్ పాకిస్థాన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి వన్డేల్లో కేవలం 13ఇన్నింగ్స్‌లో 1000కు పైగా పరుగులు చేశాడు. తద్వారా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (17ఇన్నింగ్స్‌లలో 1000పరుగుల) రికార్డును ఆజామ్ అధిగమించాడు. ఇక బాబర్ మైలురాయిని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. కోహ్లీ మార్క్‌ను అధిగమించడానికి బాబర్ ఆజామ్‌కు మ్యాచ్ ప్రారంభానికి ముందు 98పరుగులు అవసరం కాగా.. అతను తన ఫామ్ కొనసాగిస్తూ సెంచరీ పూర్తి చేసి 1000పరుగులు అందుకోవడంతో పాటు కోహ్లీ రికార్డును బద్ధలు కొట్టాడు.

ప్రస్తుతం బాబర్ ఆజామ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత ఫాంలో ఉన్న ప్లేయర్. ఇక అతను ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీ20 ఫార్మాట్, వన్డే ఫార్మాట్లో తొలి ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక టెస్ట్ క్రికెట్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇకపోతే కెప్టెన్‌గా అతను 13 ఇన్నింగ్స్‌లలో 1000పరుగులు పూర్తిచేసుకోగా.. అందులో 7 ఇన్నింగ్స్‌ల్లో స్వదేశంలోని తనకు ఫేవరేట్ పిచ్‌లపై ఆడాడు. ఏదేమైనా ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ ఆజామ్ కచ్చితంగా అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడనేది వాస్తవం.

Story first published: Thursday, June 9, 2022, 16:25 [IST]
Other articles published on Jun 9, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+