For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అబ్బెబ్బే.. నాకు అలాంటి బలహీనత లేదు.. బుకాయిస్తున్న బాబర్!

శ్రీలంకపై పాకిస్తాన్ టెస్టు సిరీస్ నెగ్గింది. ఏడాదిగా టెస్టు విజయం లేని పాక్‌కు ఇది శుభవార్తే. అయితే ఆ టీం కెప్టెన్, స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్ మాత్రం ఈ సిరీసులో తేలిపోయాడు. ఒక్కటంటే ఒక్క ఇన్నింగ్సులో కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా లంక స్పిన్నర్ ప్రబాత్ జయసూరియను బాబర్ ఏమాత్రం ఎదుర్కోలేకపోయాడు.

ఈ సిరీసులో మూడు ఇన్నింగ్సుల్లో బ్యాటింగ్ చేసిన బాబర్.. కేవలం 25.33 సగటుతో 76 పరుగులే చేశాడు. ఈ మూడు సార్లూ ప్రబాత్ బౌలింగ్‌లోనే బాబర్ అవుటయ్యాడు. దీంతో ప్రబాత్‌ను బాబర్ ఎదుర్కోలేడని విమర్శలు వచ్చాయి. అయితే అలాంటిదేం లేదని బాబర్ తేల్చిచెప్పాడు.

Babar Azam

గతేడాది నుంచి ఇప్పటి వరకు ప్రబాత్ బౌలింగ్‌లో బాబర్ ఏకంగా ఆరుసార్లు అవుటయ్యాడు. దీంతో బాబర్ బలహీనతను ప్రబాత్ పట్టేశాడని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఏమాత్రం కరెక్ట్ కాదని బాబర్ అన్నాడు. 'ఒక మ్యాచ్‌లో ప్రబాత్ ఏకంగా 50 ఓవర్లు వేస్తే.. ఏదో ఒక టైంలో నేను పొరపాటు చేయడం సహజమే' అని చెప్పాడు.

'తను శ్రీలంక బెస్ట్ బౌలర్లలో ఒకడు. తన బౌలింగ్‌లో నేను చాలాసార్లు అవుటవడం నిజమే. అయితే దీనిపై నేను కూడా బాగా వర్క్ చేశా. చివరి ఇన్నింగ్సులో పరుగులు కూడా చేశా' అని బాబర్ అన్నాడు. అలాగే కేవలం తను మాత్రమే ప్రబాత్ బౌలింగ్‌లో కొంత తడబడ్డానని, మిగతా పాక్ బ్యాటర్లు మాత్రం చెలరేగారని గుర్తుచేశాడు.

'నేనొక్కడినే ప్రబాత్ బౌలింగ్‌‌లో అవుటయ్యా. కానీ మా బ్యాటర్లు అతన్ని చక్కగా ఎదుర్కోవడమే కాదు. బాగా డామినేట్ చేశారు కూడా. ఇది ఒక టీంగా మా విజయం. నేను తడబడితే.. మిగతా వాళ్లు ముందడుగు వేసి రాణించారు. ఇది ఒక కెప్టెన్‌గా నాకు మంచి పాజిటివ్ విషయమే' అని నవ్వేశాడు.

Story first published: Friday, July 28, 2023, 19:41 [IST]
Other articles published on Jul 28, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+