టీ20ల్లో కోహ్లీ రికార్డుని బద్దలు కొట్టిన పాకిస్థాన్ ఓపెనర్

హైదరాబాద్: క్రికెట్‌లో ఉన్న అనేక రికార్డులను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బద్దలు కొడుతుంటే.... కోహ్లీ నమోదు చేసిన ఓ రికార్డుని పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజాం బద్దలు కొట్టాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ రికార్డుని బాబర్ అజాం తాజాగా అధిగమించాడు.

58 బంతుల్లో 78 పరుగులు చేసిన బాబర్ అజాం
ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో బాబర్ అజాం 58 బంతుల్లో 78 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

27 ఇన్నింగ్స్‌లో టీ20ల్లో 1000 పరుగులు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని 27 ఇన్నింగ్స్‌లో అందుకుంటే.. బాబర్ 26 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించి అతని రికార్డును అధిగమించడం విశేషం. ఇదిలా ఉంటే న్యూజిలాండ్‌తో దుబాయి వేదికగా జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌ను ఆతిథ్య పాకిస్థాన్ జట్టు 3-0తో క్లీన్ స్వీస్ చేసింది.

పాకిస్థాన్ జట్టు అరుదైన ఘనత
దీంతో పాకిస్థాన్ జట్టు అరుదైన ఘనత సాధించింది. టీ20ల్లో ఈ విజయం పాకిస్థాన్‌కు ఇది వరుసగా తొమ్మిదవ విజయం. ఈ జాబితాలో ఆప్ఘనిస్థాన్ జట్టు వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్, పాకిస్థాన్ వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచి ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.

అత్యధిక సిరీస్‌లు గెలిచిన జాబితాలో పాకిస్థాన్
వరుసగా అత్యధిక సిరీస్‌లు గెలిచిన జాబితాలో భారత్(6 టీ20 సిరీస్‌లు) పాక్ తర్వాతి స్థానంలో ఉంది. మరోవైపు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న బాబర్ అజాం తన ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు. ఇక, ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న మూడు టీ20ల నుంచి సెలక్టర్లు కోహ్లీకి విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications