Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pak vs NZ: 'తాబేలు - కుందేలు కథలా ఉందే'.. బాబర్ జిడ్డూ బ్యాటింగ్‌పై పేలుతోన్న సెటైర్లు

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కరాచీ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఓపెనింగ్ గేమ్ లో అతడు ఆడిన తీరుపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.

321 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ టాప్ ఆర్డర్.. కివీస్ బౌలర్ల దెబ్బకు ఫూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై భారీ ఆశలు పెట్టుకోగా అతడు 64 పరుగులు చేసి ఔట్ అవ్వడం ప్రేక్షకులకు తీవ్ర నిరాశకు గురి చేసింది.

Babar azam Trolled for slow innings in Pakistan vs New Zealand match champions trophy

వాస్తవానికి సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, ఫకర్ జమ్మాన్ అంతా పెవిలియన్ చేరడంలో బాబర్ ఆజామ్ దూకుడుగా ఆడతాడని అంతా ఆశించారు. కానీ బాబార్ మాత్రం తన స్లో ఇన్నింగ్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. టాప్ ఆర్డర్ లో అతడు హాఫ్ సెంచరీ చేసినప్పటికీ చాలా స్లోగా జిడ్డు బ్యాటింగ్ చేశాడు. 90 బంతుల్లో 6 ఫోర్లు ఓ సిక్స్ సాయంతో 64 రన్స్ చేశాడు.

క్రీజులో నిలదొక్కుక్కున్న తర్వాత కూడా అతడు దూకుడుగా ఆడే ప్రయత్నం చేయకుండా డిఫెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ సాధించడానికి అతడికి 81 బంతులు పట్టింది. దీంతో అతడి జిడ్డు బ్యాటింగ్‌తో పాకిస్థాన్ విజయవకాశాలు దెబ్బతన దెబ్బతిన్నాయని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది అడుతున్న అతడు.. అర్ధ శతకం నమోదు చేయాలనే లక్ష్యంతోనే ఈ జిడ్డు బ్యాటింగ్ చేశాడని అభిప్రాయపడుతున్నారు.

తాబేలు - కుందేలు కథ..
బాబర్ ఆజామ్ - వైస్ కెప్టెన్ సల్మాన్ అలీతో కలిసి 58 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే సల్మాన్ దూకుడుగా ఆడినప్పటికీ బాబార్ మాత్రం చాలా నెమ్మెదిగా ఆడాడు. దీనిపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. తాబేలు - కుందేలు కథతో వీరిని పోల్చాడు. "బాబర్.. సల్మాన్ తో కలిసి హాఫ్ సెంచరీ చేయడం తాబేలు - కుందేలు కథను బాగా రిప్రెజెంట్ చేస్తుంది." అని విమర్శలు చేశాడు.

Story first published: Thursday, February 20, 2025, 12:38 [IST]
Other articles published on Feb 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+