మళ్లీ అతడికే 'బలి పశువు' కిరీటం?
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో పాకిస్థాన్ 104 పరుగుల తేడాతో అవమానకరమైన ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి పాక్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ముఖ్యంగా కెప్టెన్ షాన్ మసూద్ కెప్టెన్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 2023 డిసెంబర్‌లో కెప్టెన్సీ చేపట్టిన మసూద్.. ఇప్పటివరకు తాను సారథ్యం వహించిన 15 మ్యాచ్‌ల్లో 11 ఓటములను చూడటం గమనార్హం. కేవలం కెప్టెన్సీలోనే కాకుండా, బ్యాటింగ్‌లో కూడా అతను ఘోరంగా విఫలమవ్వడం జట్టు యాజమాన్యాన్ని అసహనానికి గురిచేస్తోంది.
మళ్లీ బాబర్ ఆజం వైపే చూపు
జట్టును గాడిలో పెట్టేందుకు పీసీబీ మళ్లీ బాబర్ ఆజం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మోకాలి గాయం కారణంగా మొదటి టెస్టుకు దూరమైన బాబర్.. మే 18 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో పాకిస్థాన్ ఇంకా ఏడు టెస్టులు ఆడాల్సి ఉండటంతో అనుభవజ్ఞుడైన బాబర్‌కు మళ్లీ పగ్గాలు అప్పగించాలని బోర్డులోని కొందరు కీలక సభ్యులు భావిస్తున్నారు. బాబర్ కూడా తిరిగి కెప్టెన్సీ చేపట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ బాధ్యతల్లోకి షాన్ మసూద్?
ఓటమి భారంతో తీవ్ర నిరాశలో ఉన్న షాన్ మసూద్.. తన కెప్టెన్సీ నుంచి తప్పుకుని బోర్డులో శాశ్వత బాధ్యతలు చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలోనే పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అతనికి 'డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ ప్లేయర్ అఫైర్స్' పదవిని ఆఫర్ చేశారు. అయితే అప్పట్లో డబ్ల్యూటీసీ సైకిల్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో మసూద్ ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అతను ఆ పదవిని చేపట్టే అవకాశం మెండుగా కనిపిస్తోంది.
వరల్డ్ కప్ లక్ష్యంగా భారీ ప్లాన్
రాబోయే వన్డే ప్రపంచకప్ నాటికి జట్టును సిద్ధం చేయడంలో భాగంగా, బాబర్‌ను ముందుగా టెస్టు కెప్టెన్‌గా చేసి, ఆపై వన్డే బాధ్యతలు కూడా అప్పగించాలని బోర్డు యోచిస్తోంది. 2019 నుండి 2023 వరకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న బాబర్, ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అతనికి పూర్తిస్థాయి బాధ్యతలు ఇస్తే జట్టులో స్థిరత్వం వస్తుందని బోర్డు భావిస్తోంది. రెండో టెస్టులో బాబర్ రాణిస్తే, అధికారికంగా ఈ మార్పులు జరిగే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications