కోహ్లీ రికార్డును తునాతునకలు చేసిన బాబర్ ఆజమ్
Babar Azam: పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్.. అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఇప్పటివరకు టీమిండియా బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉండే రికార్డును బ్రేక్ చేశాడు. ఈ కేటగిరీలో టాపర్‌గా నిలిచాడు బాబర్ ఆజమ్. పాకిస్తాన్ విరాట్ కోహ్లీగా తనకు ఉన్న పేరును నిలబెట్టుకున్నాడు.
టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధికంగా హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటివరకు విరాట్ కోహ్లీ పేరు మీద ఉండేది. మొత్తంగా 38 అర్ధ సెంచరీలను బాదాడు కోహ్లీ. 117 మ్యాచ్‌లల్లో 109 ఇన్నింగ్స్‌లల్లో కోహ్లీ 38 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ కలిపి 4,037 పరుగులు చేశాడు. అతని వ్యక్తిగత అత్యధిక పరుగులు 122 నాటౌట్. టీ20 ఇంటర్నేషనల్స్‌లల్లో కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 51.75. స్ట్రైకింగ్ రేట్ 138.15గా నమోదైంది. 361 సిక్సర్లు, 117 బౌండరీలు సాధించాడు.

తాజాగా ఈ హాఫ్ సెంచరీల రికార్డును బాబర్ ఆజమ్ కొల్లగొట్టాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లల్లో 39 అర్ధ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. ఐర్లాండ్‌పై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అతను ఈ ఘనతను సాధించాడు. చివరి టీ20లో 42 బంతుల్లో అయిదు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 75 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచింది.
డబ్లిన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. 17 ఓవర్లల్లోనే ఈ లక్ష్యాన్ని ఛేదించింది పాకిస్తాన్. నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. అతనే టాప్ స్కోరర్. మహ్మద్ రిజ్వాన్ 38 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 56 పరుగులు చేశాడు.
టీ20 ఇంటర్నేషనల్స్‌లో బాబర్ ఆజమ్ రికార్డులు దాదాపుగా కోహ్లీతో సమానంగా ఉండటం విశేషమే మరి. ఆజమ్ కూడా 117 మ్యాచ్‌లు ఆడాడు. 110 ఇన్నింగ్స్‌లల్లో 39 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అతని వ్యక్తిగత అత్యధిక పరుగులు కూడా కోహ్లీ లాగే 122. మూడు సెంచరీలు ఉన్నాయి అతని టీ20 కేరీర్‌లో. స్ట్రైక్ రేట్ 129.97. బ్యాటింగ్ యావరేజ్ 41.19.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications