న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAk vs SL: బాబర్‌ ఆజమ్‌ సూపర్ సెంచరీ.. కోహ్లీ రికార్డు బద్దలు!!

Babar Azam smashed his 11th ODI hundred to surpass India captain Virat Kohli

కరాచీ: దశాబ్ధ కాలం తర్వాత సొంత గడ్డపై జరిగిన వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్‌ అద్భుత ప్రదర్శన చేసింది. కరాచీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌ సూపర్ సెంచరీ (111) చేయడంతో పాక్‌ 67 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బాబర్‌ ఆజామ్‌ రికార్డు సృష్టించాడు. సెంచరీతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అధిగమించాడు.

<strong>అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన అన్ను రాణి!!</strong>అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన అన్ను రాణి!!

కోహ్లీ రికార్డు బద్దలు

కోహ్లీ రికార్డు బద్దలు

బాబర్‌ ఆజమ్‌ వన్డేల్లో అత్యంత వేగంగా 11 సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. బాబర్‌ 71 ఇన్నింగ్స్‌ల్లో 11 సెంచరీలు చేసి విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. అంతకు ముందు కోహ్లీ 82 ఇన్నింగ్స్‌ల్లో 11 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అషీమ్ ఆమ్లా 64 ఇన్నింగ్స్‌ల్లో, డికాక్‌ 65 ఇన్నింగ్స్‌ల్లోనే 11 సెంచరీలు సాధించారు.

19 ఇన్నింగ్స్‌లు.. 1000 పరుగులు

19 ఇన్నింగ్స్‌లు.. 1000 పరుగులు

బాబార్‌ తన ఖాతాలో మరో రికార్డును కూడా వేసుకున్నాడు. వన్డేల్లో ఏడాది కాలంలో వెయ్యి పరుగులు పూర్తి చేసిన పాకిస్థాన్‌ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 1000 పరుగులు పూర్తిచేయడానికి బాబర్‌ 19 ఇన్నింగ్స్‌లు ఆడాడు. రెండేళ్ల క్రితం పాకిస్తాన్ మాజీ కోచ్ మిక్కీ ఆర్థర్ బాబర్ ఆజమ్‌ను విరాట్ కోహ్లీతో పోల్చాడు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కూడా మరోసారి ఆర్థర్ పోలికను తెచ్చాడు. బాబర్ అజామ్ ప్రపంచంలోని టాప్ 5 బ్యాట్స్ మెన్లలో ఒకడు అవుతాడని ఆర్థర్ చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే బాబర్ పరుగుల వరద పారిస్తున్నాడు.

ఆజమ్‌ సెంచరీ

ఆజమ్‌ సెంచరీ

ముందుగా పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 305 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఫఖర్‌ జమాన్‌ (54) అర్ధ సెంచరీ, బాబర్‌ ఆజమ్‌ సెంచరీ చేశారు. ఇమామ్ (31), సోహైల్ (40) పర్వాలేదనిపించారు. లంక బౌలర్ వనిండు హసరంగ రెండు విసికెట్లు తీశాడు. తర్వాత లంక 46.5 ఓవర్లలో 238 పరుగులకే ఆలౌటైంది. ఓ దశలో 28/5 స్కోరుతో ఇబ్బందుల్లో ఉన్న జట్టును షెహాన్‌ జయసూర్య (96), షనక (68) ఆరో వికెట్‌కు 177 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఉస్మాన్‌ షెన్వరీకి 5 వికెట్లు దక్కాయి.

2009లో ఉగ్రవాదులు

2009లో ఉగ్రవాదులు

2009 జనవరిలో పాక్‌ పర్యటనకు వెళ్లిన శ్రీలంక ఆటగాళ్ల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ ఘటనలో పాక్ ఆటగాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో పాక్‌లో పర్యటించేందుకు ఏ దేశం ముందుకు రాలేదు. ఇక దుబాయ్‌ వేదికగా పాకిస్థాన్‌ ద్వైపాక్షిక సిరీసులు ఆడుతూ వస్తోంది. దశాబ్ధ కాలం తర్వాత శ్రీలంక పాక్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది.

Story first published: Tuesday, October 1, 2019, 9:36 [IST]
Other articles published on Oct 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X