T20 World Cup 2021: నేనే ఓపెనింగ్ చేస్తా.. టీమిండియా కచ్చితంగా ఓడిస్తాం: బాబర్ అజామ్

కరాచీ: యూఏఈ, ఒమన్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2021కు సమయం ఆసన్నమవుతోంది. అక్టోబర్ 17 నుంచి ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచులు ఆరంభం కాగా.. అక్టోబర్ 17న క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 23న సూపర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి.
ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. దాయాదుల మధ్య చాలా రోజుల తర్వాత మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ మ్యాచుపై ఇప్పటికే తమతమ అభిప్రాయాలు చెప్పారు.

హై ఓల్టేజ్ మ్యాచ్
అక్టోబర్ 24న జరిగే మ్యాచ్‌తో భారత్, పాకిస్తాన్ జట్లు టీ20 ప్రపంచకప్ 2021లో తమ ప్రయాణాన్ని ప్రారంభించనున్నాయి. విజయంతో టోర్నీని ఆరంభించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఐసీసీ, ఆసియా కప్ టోర్నమెంట్లలో మాత్రమే దాయాది జట్ల మధ్య జరిగే పోరుకోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అభిమానులు.
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్, పాక్ మరోసారి తలపడనున్నాయి. దాంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచుపై అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ మరోసారి స్పందించాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుపై విజయం సాధించి శుభారంభం చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. మొహ్మద్ రిజ్వాన్‌తో కలిసి తాను ఓపెనింగ్ చేస్తానని తెలిపాడు.

భారత్‌ను ఓడిస్తే
తాజాగా క్రికెట్ పాకిస్తాన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాబర్ అజామ్ మాట్లాడుతూ... 'ఇప్పుడు మా ద్యేయం ఒక్కటే. టీమిండియాను ఓడించడం. ప్రస్తుతం మేము పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత్‌ను ఓడిస్తే.. మరింత బలోపేతమవుతాం. ప్రపంచకప్‌లో రిజ్వాన్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తా.
పరిస్థితులకు అనుగుణంగా జట్టులో మార్పులు చేసుకుంటాము. మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్‌లు మ్యాచ్ విన్నర్లు. వారి సలహాలు మైదానంలో ఉపయోగపడుతాయి. అలాంటి సీనియర్లు జట్టులో ఉండటం కలిసొచ్చే అంశం' అని అన్నాడు.

వాళ్లే గెలుస్తారు
ఈ మధ్య కాలంలో యూఏఈలో ఆడిన అనుభవం తమకు కలిసొస్తుందని బాబర్ అజామ్ చెప్పాడు. 'ప్రతి మ్యాచ్‌లో ఉండే ఒత్తిడి, తీవ్రత గురించి మాకు తెలుసు. ముఖ్యంగా తొలి మ్యాచ్.. అది కూడా టీమిండియాతో అయితే ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి తొలి మ్యాచ్‌లోనే గెలిచి అదే దూకుడును కొనసాగిస్తామన్న నమ్మకం ఉంది.
గత మూడు, నాలుగేళ్లుగా యూఏఈలో మ్యాచ్‌లు ఆడుతున్నాం. అక్కడి కండిషన్స్ మాకు బాగా తెలుసు. పిచ్ ఎలా మారుతుంది, అందుకు తగినట్లుగా ఎలా మార్పులు చేసుకోవాలో తెలుసు. అయితే మ్యాచులో ఎవరు బాగా ఆడతారో వాళ్లే గెలుస్తారు' అని బాబర్ అజామ్ చెప్పుకొచ్చాడు.

టీమిండియాదే పైచేయి
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ధ్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే దాయాది జట్లు తలపడుతున్నాయి. చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్‌లో పాక్ పర్యటించింది. 2008లో ఆసియా కప్ కోసం టీమిండియా.. పాక్‌కు వెళ్లింది.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆ జట్టు భారత్‌తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. 2018 ఆసియా కప్, 2019 వన్డే ప్రపంచకప్ పోరులో పాక్ ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్ ఐదుసార్లు ఆడింది. అందులో భారత్ నాలుగు గెలుపొందింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
DC vs KKR Qualifier 2: నేరాన్ని ఒప్పుకున్న దినేష్ కార్తీక్.. జరిమానా వేసిన ఐపీఎల్ యాజమాన్యం! నిషేధం పడేనా?