న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'లైంగికంగా వాడుకున్నందుకు.. బాబర్ ఆజమ్‌ రూ.45 లక్షలు ఇవ్వాలి! అలా అయితేనే..!'

Babar Azams rumoured girlfriend Hamiza Mukhtar demanding INR 45 lakh to withdraw case

కరాచీ: గత నెలాఖరులో పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై హమీజా ముక్తర్ అనే ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లుగా బాబర్ లైంగికంగా వాడుకుంటున్నాడని, గర్భవతిని కూడా చేశాడని ఆమె పేర్కొన్నారు. బాబర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను డబ్బు సాయం చేశానని కూడా చెప్పుకొచ్చారు. ఇదే విషయమై బాబర్‌పై హమీజా ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో కీలక మలుపు తిరిగింది

రూ.45 లక్షలు భరణంగా ఇవ్వాలి:

రూ.45 లక్షలు భరణంగా ఇవ్వాలి:

బాబర్‌ ఆజమ్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటే రూ.45 లక్షలు భరణంగా ఇవ్వాలంటూ హమీజా ముక్తర్ డిమాండ్ చేస్తున్నారు. బాబర్‌ తనకు భరణం చెల్లించాలంటూ కోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. హమీజా పిటిషన్‌పై గురువారం పాక్ సెషన్స్‌ కోర్టు విచారణ చేపట్టింది. బాబర్‌పై హమీజ్‌ అనవసర ఆరోపణలు చేస్తున్నారని, కేవలం డబ్బు కోసమే ఈ నాటకమాడుతున్నారని, ఒక్కపైసా కూడా చెల్లించేది లేదని బాబర్‌ తరపు లాయర్‌ కోర్టుకు తెలిపారు. మరోవైపు హమీజా తరపు లాయర్ మాట్లాడుతూ.. హమీజాపై బాబర్‌ లైంగిక వేధింపులకు పాల్పడడంపై తమవద్ద ఆధారాలు ఉన్నాయని‌ కోర్టుకు చెప్పారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది.

శారీరకంగా దగ్గరయ్యాం:

శారీరకంగా దగ్గరయ్యాం:

ఇటీవల మీడియా సమావేశంలో సదరు మహిళ మాట్లాడుతూ... 'బాబర్ ఆజమ్, నేను స్కూల్‌ రోజుల నుంచి మంచి స్నేహితులం. బాబర్ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నాను. అతనికి ఆర్థికంగా కూడా సాయం చేశాను. 2010లో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. బాబర్ నాకు ప్రపోజ్ చేశాడు. అందుకు నేను అంగీకరించాను. ఆ తర్వాతి ఏడాదే తాము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. శారీరకంగా కూడా దగ్గరయ్యాం. జాతీయ జట్టుకు సెలక్ట్ అయ్యాక బాబర్ తన మనసు మార్చుకున్నాడు. అప్పటినుంచి నన్ను కావాలనే దూరం పెడుతున్నాడు. ఇదే విషయమై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. చంపుతానని నాపై బెదిరింపులకు పాల్పడ్డాడు. నన్ను కొట్టి శారీరకంగా హింసకు గురిచేశాడు. అప్పట్లో బాబర్‌పై పీసీబీకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు' తెలిపారు.

తొలి టెస్టుకు దూరం:

తొలి టెస్టుకు దూరం:

ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. సిరీస్‌ ప్రారంభానికి ముందే వేలి గాయంతో బాబర్‌ ఆజమ్ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. మూడు టీ20ల సిరీస్‌ను కివీస్‌ జట్టు 2-1 తేడాతో కైవసం చేసకుంది. ఇక డిసెంబర్‌ 26 నుంచి పాక్‌, న్యూజిలాండ్‌ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌ మొదలుకానుంది. అయితే బాబర్‌ గాయం తీవ్రత అలాగే ఉండడంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. బాబర్‌ స్థానంలో మహ్మద్‌ రిజ్వాన్‌ పాక్‌ జట్టకు నాయకత్వం వహించనున్నాడు.

టీమిండియాకు భారీ షాక్.. 6 నెలల పాటు స్టార్ పేసర్ దూరం!! మళ్లీ ఐపీఎల్‌లోనే!

Story first published: Friday, December 25, 2020, 12:40 [IST]
Other articles published on Dec 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X