IND vs PAK: అందుకే షోయబ్ మాలిక్‌కి చోటిచ్చాం.. అసలు విషయం చెప్పేసిన బాబర్ ఆజామ్!!

దుబాయ్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ ప్రపంచానికే పూనకం వచ్చేస్తుంది. మ్యాచ్ ఎప్పుడు జరిగినా ఉత్కంఠంగానే ఉంటుంది. దాయాదుల పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెడుతుంటుంది. మరికొద్ది గంటల్లో ఫాన్స్ భారత్-పాక్ మ్యాచును మరోసారి చూసేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. భారత్, పాకిస్థాన్ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు.
దీంతో ఐసీసీ టోర్నీల్లోనే ఈ జట్ల మధ్య పోరాటాలను చూసే అవకాశం కలుగుతోంది. చివరగా 2019 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాక.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2021లో దాయాది దేశాలు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేననే ఫేవరేట్ అనడంలో సందేహం లేదు. అయినా పాక్ జట్టును ఎప్పుడూ తక్కువగా అంచనావేయరాదు.

తుది జట్టుని ప్రకటించిన పాక్:
టీ20 ప్రపంచకప్ 2021 మ్యాచ్‌లో భాగంగా భారత్‌తో ఆదివారం పాకిస్థాన్ తలపడనుండగా.. శనివారమే పాక్ తమ తుది జట్టుని (12 మందితో కూడిన జట్టు) ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన పాక్ జట్టులో సీనియర్ బ్యాటర్ షోయబ్ మాలిక్‌కి చోటిచ్చాడు కెప్టెన్ బాబర్ ఆజామ్. దాంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వన్డే, టెస్టులకి గుడ్ బై చెప్పేసిన మాలిక్.. కేవలం టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. అందులోనూ ఇటీవలి కాలంలో పెద్దగా పరుగులు చేయడం లేదు. దానికి తోడు 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా.. ఆ మ్యాచ్‌లో మాలిక్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అయినప్పటికీ మాలిక్‌కి పాక్ చోటివ్వడం గమనార్హం. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.

రెండోసారి జట్టులోకి మాలిక్:
నిజానికి భారత్‌తో మ్యాచ్‌కి తొలుత మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ని తీసుకుందామని పాక్ మేనేజ్‌మెంట్ భావించిందని సమాచారం తెలుస్తోంది. అయితే సర్ఫరాజ్ కంటే స్పిన్‌ని బాగా ఆడగల షోయబ్ మాలిక్‌ని తుది జట్టులోకి తీసుకోవడం మంచిదని ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నారట. దాంతో సర్ఫరాజ్‌కి నిరాశే ఎదురైంది. వాస్తవానికి పాక్ ముందుగా ప్రకటించిన 15 మంది సభ్యుల్లో మాలిక్ పేరు లేనేలేడు. అక్టోబర్ 10కి ముందు పాక్ మరోసారి జట్టును ప్రకటించగా.. అప్పుడు మాలిక్ జట్టులోకి వచ్చాడు. పాక్ రెండోసారి ముగ్గురు ఆటగాళ్లకు చోటిచ్చింది. మాలిక్, హఫీజ్, ఫకర్‌లను తీసుకుంది పాక్. ఇక మాలిక్ ఎంపిక గురించి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ శనివారం మీడియాతో మాట్లాడాడు. సర్ఫరాజ్‌ని కాదని మాలిక్‌ను తాము ఎందుకు జట్టులోకి తీసుకున్నామో వివరించాడు.

సర్ఫరాజ్‌కి కూడా అవకాశాలిస్తాం:
శనివారం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మీడియాతో మాట్లాడుతూ... 'సర్ఫరాజ్ అహ్మద్ స్పిన్‌లో బాగా ఆడగలడు. అలానే భారత్‌పై ఆత్మ విశ్వాసంతో బ్యాటింగ్ చేయగలడు. కానీ మేము టీమిండియాపై అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగాలనుకున్నాం. స్పిన్‌ని షోయబ్ మాలిక్ బాగా ఆడగలడు. ఫ్రంట్ ఫుట్‌పైకి వెళ్లి మరీ సమర్థంగా ఎదుర్కోగలడు. అందుకే సర్ఫరాజ్‌కి బదులుగా మాలిక్‌ని తుది జట్టులోకి తీసుకున్నాం. అయితే వచ్చే మ్యాచ్‌ల్లో సర్ఫరాజ్‌కి కూడా అవకాశాలిస్తాం. ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. మా అంతిమ లక్ష్యం మాత్రం విజయం సాదాయించడమే' అని తెలిపాడు. సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ జట్టుని పాకిస్థాన్ ఓడించిన సంగతి తెలిసిందే. ఇక భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని షోయబ్ మాలిక్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

పాకిస్థాన్ జట్టు:
బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫకార్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీమ్, షదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హారీస్ రౌప్, హైదర్ అలీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
IND vs PAK Dream11 :డ్రీమ్11 టీమ్..కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!