Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. మళ్లీ ఆ సీటు మనదే!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ క్రికెట్లో వాతావరణం మారినట్లుగా కెప్టెన్లను మార్చడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇందులో భాగంగానే పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజంకు మళ్లీ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. దాదాపు మూడేళ్ల క్రితం బాబర్ ఆజం అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీల నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్‌గా ఉన్న షాన్ మసూద్ వరుస పరాజయాలతో విఫలం కావడంతో పీసీబీ అతనిపై వేటు వేసి బాబర్ ఆజంను తిరిగి ఆ స్థానంలో నియమించింది. ఈ నెల చివర్లో వెస్టిండీస్ జట్టుతో జరగబోయే 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టును ప్రకటించిన పీసీబీ.. ఈ కీలక మార్పును వెల్లడించింది.

గతంలో 2023 నవంబర్ 15న బాబర్ ఆజం మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత టెస్ట్ క్రికెట్ బాధ్యతలను షాన్ మసూద్ కు అప్పగించారు. కానీ షాన్ మసూద్ సారథ్యంలో పాకిస్థాన్ టెస్ట్ జట్టు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మసూద్ కెప్టెన్సీలో పాకిస్థాన్ ఆడిన 16 టెస్టుల్లో ఏకంగా 12 మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇంత తక్కువ కాలంలో ఇన్ని మ్యాచ్‌లు ఓడిపోయిన ఏకైక కెప్టెన్‌గా మసూద్ నిలిచాడు. పాక్ క్రికెట్ చరిత్రలో మిస్బా-ఉల్-హక్ మాత్రమే షాన్ మసూద్ కంటే ఎక్కువ మ్యాచ్‌లలో ఓడిపోయాడు. మిస్బా-ఉల్-హక్ తన కెప్టెన్సీలో ఆడిన 56 టెస్టుల్లో 19 మ్యాచ్‌ల్లో పరాజయం పాలయ్యాడు.

Babar Azam Reappointed As Pakistan Test Captain Replacing Shan Masood For West Indies Series Details

తాజాగా వెస్టిండీస్ జట్టుతో జరగబోయే రాబోయ్ టెస్ట్ సిరీస్ కోసం పీసీబీ 17 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టుకు బాబర్ ఆజం సారథ్యం వహించనున్నాడు. కెప్టెన్సీ కోల్పోయిన షాన్ మసూద్‌ను కేవలం ఆటగాడిగా జట్టులో కొనసాగించడం గమనార్హం. ఓ వైపు పరాజయాల భారంతో ఉన్న పాకిస్థాన్ జట్టును, వెస్టిండీస్ సిరీస్ ద్వారా బాబర్ ఆజం మళ్లీ విజయాల బాటలోకి ఎలా నడిపిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు:
బాబర్ ఆజం(కెప్టెన్), ఇమామ్-ఉల్-హక్, అజాన్, అబ్దుల్లా ఫజల్, అవైస్ జఫర్, షాన్ మసూద్, అఘా సల్మాన్, గాజీ గోరి, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, అలీ ఉస్మాన్, సాజిద్ ఖాన్, మహ్మద్ అలీ, ఆమీర్ జమాల్, అబ్బాస్, ఉబైద్ షా, ఖుర్రమ్ షెహజాద్.

Story first published: Sunday, July 5, 2026, 14:48 [IST]
Other articles published on Jul 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+