ఆటను ఆస్వాదించడానికి ప్రేక్షకులు స్టేడియానికి తరలిస్తుంటారు. తమ ఆరాధ్య ఆటగాళ్లను చూడటానికి మరికొందరు వస్తుంటారు. అయితే వాళ్లలో కొందరు ఆకతాయిలు కూడా ఉంటారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని అవమానించడం, దూషించడం, ట్రోల్ చేయడం చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో జరుగుతుంటాయి.
అయితే పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్‌ను తమ దేశస్తులే విపరీతంగా ట్రోల్ చేశారు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో బాబర్‌కు ఈ ఛేదు అనుభవం ఎదురైంది. కొందరు ఆకతాయిలు బాబర్‌ను దారుణంగా ట్రోల్ చేశారు. జింబాబర్.. జింబాబర్.. అంటూ నినాదాలు చేశారు. దీంతో బాబర్ అజామ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తనని ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తున్న ప్రేక్షకులపై స్టేడియంలో బాబర్ సీరియస్ అయ్యాడు.

'ఒరెయ్య్ ఇటు రారా.. బాటిల్‌తో కొట్టేస్తా' అంటూ అక్కడ ఉన్న ఫ్యాన్స్‌కు సింబాలిక్‌గా బాబర్ అజామ్ వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ ఆ ప్రేక్షకులు బాబర్‌ను ట్రోల్ చేయడం కొనసాగించారు. దాంతో వాళ్లను పట్టించుకోవడం మానేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. జింబాబ్వే జట్టుపై మినహా మిగిలిన దేశాలపై బాబర్ అజామ్ సాధికారికంగా పరుగులు చేయలేడని అతడిపై విమర్శలు వస్తుంటాయి.
గతంలో జింబాబ్వేతో పాకిస్థాన్ ఎక్కువగా సిరీస్‌లు ఆడేది. ఆ మ్యాచ్‌ల్లో బాబర్ సెంచరీలు, హాఫ్ సెంచరీలు సాధించి తన సగటును పెంచుకున్నాడని, ర్యాంక్‌లు మెరుగుపర్చుకున్నాడని... బాబార్‌పై కొందరు విమర్శిస్తుంటారు. అందుకే అతడిని తరుచూ జింబాబర్ అంటుంటారు. కాగా, వన్డ్ వరల్డ్ కప్ ముగిసిన అనంతరం బాబర్ అజామ్ పాకిస్థాన్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మెగాటోర్నీలో జట్టు ఓటమికి బాధ్యత వహిస్తూ అన్ని ఫార్మాట్ల నుంచి సారథిగా తప్పుకుని బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
అయితే ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ జట్టుకు బాబర్ అజామ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 17 నుంచి మొదలైన ఈ లీగ్ మార్చి 18న ముగుస్తుంది. ఆరు జట్లు ఈ సీజన్‌లో పాల్గొంటున్నాయి. మూడు మ్యాచ్‌లు ఆడిన పెషావర్ ఒక్క విజయంతో అయిదో స్థానంలో ఉంది.