Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు: 26 బంతుల్లో సెంచరీ

Babar Azam hits 26-ball hundred

హైదరాబాద్: పాకిస్తాన్‌ యువ ఆటగాడు బాబర్‌ అజామ్‌ 26 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఫైసలాబాద్‌లో జరిగిన ఓ ఛారిటీ మ్యాచ్‌లో ఎస్‌ఏఎఫ్‌ రెడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్‌ అజామ్‌ ఈ ఘనత సాధించాడు. అది కూడా టీ10 మ్యాచ్‌లో కావడం ఇక్కడ విశేషం.

షాహిద్‌ ఆఫ్రిది ఫౌండేషన్‌(ఎస్‌ఏఎఫ్‌) ఛారిటీ మ్యాచ్‌లో భాగంగా ఎస్‌ఏఎఫ్‌​ గ్రీన్‌ తరపున బరిలోకి దిగిన బాబర్‌ అజామ్‌ 26 బంతుల్లో సెంచరీని నమోదు చేశాడు. బాబర్‌ అజామ్‌ ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు, 7 బౌండరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఏఎఫ్‌ రెడ్స్‌ 10 ఓవర్లలో 210 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఏఎఫ్‌​ గ్రీన్‌ జట్టు ఓపెనర్‌గా బరిలోకి దిగిన అజామ్‌ ఎస్‌ఏఎఫ్‌ రెడ్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో ఎస్‌ఏఎఫ్‌​ గ్రీన్‌ ఐదు ఓవర్లలో 100కు పైగా పరుగులు చేసింది. ఇక్కడ విశేషం ఏమిటంటే షోయబ్ మాలిక్ ఓవర్‌లో బాబర్ అజామ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టాడు

ఇక చివర్లో షాహిద్‌ ఆఫ్రిది బౌండరీ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇదిలా ఉంటే ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 35 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచ రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, December 24, 2017, 21:58 [IST]
Other articles published on Dec 24, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+